By: ABP Desam | Updated at : 03 Mar 2022 02:56 PM (IST)
Edited By: Ramakrishna Paladi
2 పీపీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా! వడ్డీ లేకుండా ఒకటి వదిలేసుకోవాల్సిందే!
PPF news: మీకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ పీపీఎప్ ఖాతాలు (Public Provident Fund- PPF) ఉన్నాయా? వాటిని 2019, డిసెంబర్ 12 తర్వాత ఓపెన్ చేశారా? అయితే చిక్కుల్లో పడ్డట్టే! అలాంటి అకౌంట్లను విలీనం (PPF Merging) చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి వడ్డీ చెల్లించకుండానే ఆ ఖాతాలను రద్దు చేయనుంది.
పీపీఎఫ్ నిబంధనలు -2019 ప్రకారం పీపీఎఫ్ ఖాతాలను విలీనం చేసే ప్రతిపాదనను పంపడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ తెలిపింది. మెర్జింగ్‌కు సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని వెల్లడించింది.
Also Read: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
'ఇప్పుడున్న పీపీఎఫ్ ఖాతాల్లో ఏవైనా 12/12/2019 తర్వాత ఓపెన్ చేసినవి ఉంటే వాటిని విలీనం చేయడం కుదరదు. అలాంటి ఖాతాలకు ఎలాంటి వడ్డీ ఇవ్వకుండానే రద్దు చేస్తాం. పీపీఎఫ్ అకౌంట్ల మెర్జింగుకు (Amalgamation of PPF) సంబంధించి ఎలాంటి ఉత్తర్వులను పోస్టల్ డైరెక్టరేట్‌కు జారీ చేయలేదు' అని పోస్టల్ డిపార్ట్‌మెంట్ సర్క్యూలర్‌ను జారీ చేసింది.
Also Read: ప్రతి నెలా రూ.2 వేలతో 50 లక్షలు పొందండి ఇలా..!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం నిబంధనల ప్రకారం ఎవ్వరూ ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు తెరవకూడదు. కానీ చాలామంది రెండు కన్నా ఎక్కువ ఖాతాలు తీశారు. రెండు వేర్వేరు బ్యాంకులు లేదా ఒకటి పోస్టాఫీసు ఒకటి బ్యాంకులో తీశారు.
ఉదాహరణకు 2015, జనవరిలో ఒక పీపీఎఫ్ ఖాతా తెరిచారు. అదే వ్యక్తి 2020, జనవరిలో మరో ఖాతా తెరిచారు. ఇలాంటి అకౌంట్లు మెర్జ్ అవ్వవు. 2020 తర్వాత ఓపెన్ చేసిన పీపీఎఫ్ ఖాతాను వడ్డీ చెల్లించకుండానే రద్దు చేస్తారు. కానీ 2015లో తీసిన వ్యక్తి, 2018లో మరో ఖాతా తెరిస్తే కస్టమర్ విజ్ఞప్తి మేరకు వాటిని విలీనం చేస్తారు.
Gold Price Forecast:బంగారం ధర తగ్గుతుందా? పెరుగుతుందా? కొనేముందు నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి!
Emergency Fund: అర్జంటుగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ లలో ఏది సరైనది
Zoho Pay App : జోహో సంచలన నిర్ణయం- ఫోన్‌పే,గూగుల్ పేకు పోటీగా UPI యాప్!
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్డేట్ వచ్చింది!
AP Crime News: మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం
Harish Rao Father Death: హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Avika Gor: రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
Amaravati farmers government: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం - త్యాగాలు చేసిన వారిని రోడ్డుపై వదిలేస్తున్నారా ?