అన్వేషించండి

IT Notice: ఐటీ నోటీసులు వచ్చాయా? అది ఒరిజినలో కాదో ఎలా తెలుసుకోవాలి?

IT Notice: ఐటీ దాఖలులో కేంద్రం కీలక మార్పులు చేసింది. CBDTలో DIN తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏంటీ DIN, మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆదాయపు పన్ను శాఖ పత్రాలకు డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) తప్పనిసరి.
  • DIN లేని అధికారిక సమాచారం చెల్లుబాటు కాదని, పారదర్శకత పెరుగుతుంది.
  • మార్చి 31, 2026 నుండి కొత్త DIN నిబంధనలు అమలులోకి వచ్చాయి.
  • అధికారుల పరిధి పెరిగింది, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన రక్షణ లభిస్తుంది.

IT Notice: పన్నుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆదాయపుపన్ను శాఖ మరో కీలక అడుగు వేసింది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారుల మధ్య జరిగే ప్రక్రియనలో మరింత జవాబుదారీతనం పెంచేందుకు డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ రూల్ తీసుకొచ్చింది. మార్చి 31 నుంచి అమలులోకి వచ్చిన ఈ సర్క్యులర్‌ నెంబర్‌ 4/2026 ద్వారా పాత 2019 నిబంధనల స్థానంలో ఈ నూతన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చారు. 

DIN అంటే ఏంటీ? ఎలా ఉపయగపడుతుంది?

ఆదాయపు పన్ను శాఖ నుంచి జారీ అయ్యే ప్రతి నోటీసు, ఉత్తర్వు సమన్లు, లేదా అధికారిక లేఖలకు కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్‌నే DIN అంటారు. ఇది డిజిటల్‌ పద్ధతిలో కేటాయిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం పన్ను శాఖ పంపే సమాచారం అథెంటిసిటీ తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ట్రాక్ చేసుకోవచ్చు. 

కొత్త రూల్ ప్రకారం DIN లేని ఏ అధికారి సమాచారమైన చెల్లుబాటు కాదు. అంటే మీకు వచ్చిన నోటీసుపై ఈ నెంబర్ లేకపోతే దానిని చట్టబద్ధమైనదిగా పరిగణించాల్సిన పని లేదు. 

మార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?

2019లో తీసుకొచ్చిన DIN వ్యవస్థ పారదర్శకతను పెంచినప్పటికీ కొన్ని టెక్నికల్‌, పాలనాపరమైన ఇబ్బందులతో చాలా విషయాలు కోర్టుల వరకు వెళ్లాయి. చిన్నపాటి టెక్నికల్ లోపాల వల్ల సరైన నోటీసులు కూడా చెల్లకుండా పోవం, తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయానికి గండి పడటం జరిగింది. వీటిని పరిష్కరిస్తూ, పరిపాలనా సౌలభ్యం, పారదర్శకత మధ్య సమతుల్యతను సాధించేందుకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2026 కింద మార్పులు చేశారు.   

ఈ రూల్స్ ఎప్పుడు వర్తిస్తాయి?

మార్చి 31, 2026 నుంచి జారీ అయ్యే అన్ని కమ్యూనికేషన్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. ఇందులో కొన్ని కీలకమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గతంలో డిన్ అనేది డాక్యుమెంట్‌లోనే ఉండాలనే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు దీనిని సంబంధిత ఈమెయిల్‌ బాడీలో లేదా అటాచ్‌మెంట్‌లో కూడా పంపవచ్చు. ఒక పత్రంలోని ప్రతి పేజీపై డిన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రధాన డాక్యుమెంట్‌లో ఒక చోట ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం జారీ చేసే  సాధారణ మార్గదర్శకాలు లేదా FAQsకు డిన్ అవసరం లేదు. 

డిన్ లేకుండా నోటీసులు జారీ చేసేటప్పుడు ఆ నోటీసులోనే ఎందుకు డిన్ లేకుండా పంపిస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. ా తర్వాత నిర్ణీత గడువులోగా దాన్ని సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసి డిన్ ట్యాగింగ్ చేయాలి. 

అధికారుల పరిధి పెంపు 

గతంలో ఇటువంటి అనుమతులు కేవలం చీప్‌ కమిషనర్లు, లేదా డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులే ఇచ్చే వారు. కానీ ఇప్పుడు జాయింట్‌ కమిషనర్‌ లేదా అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకు కూడా ఈ అధికారాలను కట్టబెట్టారు. దీని వల్ల పనిలో జాప్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

పన్ను చెల్లింపుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

కొత్త రూల్ పన్ను చెల్లింపుదారులకు మరింత రక్షణ కల్పిస్తోంది. ఐటీ శాఖ నుంచి ఏదైనా నోటీసు వచ్చినప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. మీకు వచ్చిన నోటీసుపై డిన్ ఉందో లేదో చూసుకోవాలి. ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆ డిన్ నెంబర్‌ ఎంటర్ చేసి ఆ నోటీసు నిజంగా ప్రభుత్వమే పంపిందా లేదా అని ద్రువీకరించుకోండి. ఒక వేళ డిన్ లేకుండా నోటీసులు వస్తే అందులో సరైన కారణం ఉందో లేదో చూడండి. అటువంటి నోటీసులకు 15 రోజుల్లోపు అధికారుల అనుమతి పొందారా లేదా అనేది గమనించాలి. భవిష్యత్‌లో ఆడిట్ లేదా ఇతర అవసరాల కోసం మీకు వచ్చే ప్రతి అధికారిక ప్రక్రియను సెక్యూర్ చేసుకోవాలి.  

Frequently Asked Questions

DIN అంటే ఏమిటి మరియు ఇది ఎలా ఉపయోగపడుతుంది?

DIN అనేది ఆదాయపు పన్ను శాఖ నుండి జారీ చేయబడిన ప్రతి నోటీసు, ఉత్తర్వు, సమన్ లేదా అధికారిక లేఖకు కేటాయించబడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది పన్ను శాఖ నుండి వచ్చే సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారిస్తుంది మరియు ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

కొత్త DIN రూల్స్ ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి?

కొత్త DIN రూల్స్ మార్చి 31, 2026 నుండి జారీ చేయబడే అన్ని కమ్యూనికేషన్లకు వర్తిస్తాయి. పాత 2019 నిబంధనల స్థానంలో ఈ నూతన ఫ్రేమ్‌వర్క్ తీసుకురాబడింది.

DIN లేని అధికారిక సమాచారాన్ని చట్టబద్ధమైనదిగా పరిగణించవచ్చా?

లేదు, కొత్త రూల్ ప్రకారం DIN లేని ఏ అధికారి సమాచారమైనా చెల్లుబాటు కాదు. మీకు వచ్చిన నోటీసుపై ఈ నంబర్ లేకపోతే, దానిని చట్టబద్ధమైనదిగా పరిగణించాల్సిన అవసరం లేదు.

పన్ను చెల్లింపుదారులు DIN రూల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఐటీ శాఖ నుండి ఏదైనా నోటీసు వచ్చినప్పుడు, దానిపై DIN ఉందో లేదో చూసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో DIN నంబర్‌ను నమోదు చేసి, నోటీసు ప్రామాణికతను ధృవీకరించుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget