By: ABP Desam | Updated at : 29 Mar 2022 09:45 AM (IST)
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్
EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. అయితే అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఈ నామినేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేయాలంది. ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీని నిర్ణీత గడువులోగా యాడ్ చేయకపోతే రిటైర్మెంట్‌కు సంబంధించిన ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను మీరు పొందలేరని హెచ్చరించింది. కరోనా సమయంలో ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అడ్వాన్స్ కింద రూ.1 లక్ష రూపాయాలను సైతం అందించారు. అంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రూల్స్ సరిగ్గా పాటిస్తే చాలా ప్రయోజనాలు మీ సొంతం.
ఈ నామినేషన్ తప్పనిసరి..
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా ఖాతాకు నామినీని యాడ్ చేసుకోవాలని పేర్కొంది. ఆన్‌లైన్ PF, పెన్షన్ మరియు బీమా ద్వారా వారిని రక్షించడానికి నామినేషన్లను నమోదు చేసుకోవడం చాలా కీలకమని పేర్కొంది. సబ్‌స్క్రైబర్స్‌కు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఇ-నామినేషన్ (EPFO E-Nomination)ను పూర్తి చేసుకున్న వారికి కుటుంబసభ్యులకు ప్రయోజనాలు అందుతాయని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ పూర్తయిన తర్వాత, జరగరాని ప్రమాదం జరిగితే నామినీకి బీమా మరియు పెన్షన్ లాంటి ప్రయోజనాలను పొందగలుగుతారని ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.
Benefits of filing e-Nomination.
— EPFO (@socialepfo) March 22, 2022
ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD
ఈ ప్రయోజనాలు అందుకోండి..
ఈ-నామినేషన్ పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హులు అవుతారు. ప్రమాదవశాత్తూ ఈపీఎఫ్ ఖాతాదారులు చనిపోయినట్లయితే వారు పేర్కొన్న నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రమాద భీమా నగదును ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. కరోనా లాంటి కష్ట సమయాలలో సైతం ఈపీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ నగదు తీసుకునే ప్రయోజనాన్ని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ కల్పించింది.
Also Read: EPF Interest Rate: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?
Also Read: EPFO E-Nomination: పీఎఫ్ డబ్బు కావాలా? ఈ-నామినేషన్ చేయండి మరి!
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం