అన్వేషించండి

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్‌ - స్వయంగా రంగంలోకి రవాణా మంత్రిత్వ శాఖ

Ola Electric Services:' సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' ఇచ్చిన షాక్‌ నుంచి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కోలుకోకముందే, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఆ కంపెనీ నెత్తిన ఓ పిడుగు వేసింది.

Ministry Of Road Transport And Highways Probe: ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. CCPA (Central Consumer Protection Authority) నుంచి నోటీస్‌ అందిన ఒక్క రోజు వ్యవధిలోనే, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఆ కంపెనీపై ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్‌కు వ్యతిరేకంగా దాఖలైన వేలకొద్దీ ఫిర్యాదులపై మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టవచ్చని సమాచారం. ఈ వారంలో మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక విచారణ ప్రారంభం కావచ్చు.  కస్టమర్ల కంప్లైంట్లపై స్పందించి, ఒక నివేదిక సమర్పించాలని ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంపెనీని ఆదేశించే సూచనలు ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో యుద్ధం
ఆఫ్టర్‌ సేల్‌ సర్వీస్‌లకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్‌పై దేశవ్యాప్తంగా విమర్శల తుపాన్‌ చెలరేగింది. సర్వీస్‌లో అలసత్వంపై ప్రశ్నించిన స్టాండప్‌ కమెడియన్‌ కునాల్ కమ్రా (Kunal Kamra) మీద ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్ అగర్వాల్ (Ola Electric CEO Bhavish Aggarwal) దారుణమైన విమర్శలు చేశారు. ఇది, ఓలా కస్టమర్లకు ఆగ్రహం తెప్పించింది. సేవా లోపాలను సరి చేసుకుండా, ప్రశ్నించిన వాళ్లపై ఎదురుదాడి చేయడమేంటంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా స్పందించారు. ఓలా ఎలక్ట్రిక్‌ సర్వీసుల్లో నిర్లక్ష్యం, జాప్యం, తప్పుడు ప్రకటనలు, తప్పుడు వ్యాపార విధానాలు వంటి ఆరోపణలతో ఆ కంపెనీపై 'నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌'కు 10,000 మందికి పైగా కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, రెండు రోజుల క్రితం, 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' (CCPA) ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి షోకాజ్‌ నోటీస్‌ పంపింది. 

CCPA నోటీస్‌ ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ వినియోగదార్ల రక్షణ చట్టంలోని చాలా నిబంధనలను ఉల్లంఘించింది. పేలవమైన సేవలు, తప్పుడు వ్యాపార ప్రకటనలు, అన్యాయుపూరిత వాణిజ్య పద్ధతులు, వినియోగదార్ల హక్కుల ఉల్లంఘనలు వంటివి ఆ నోటీస్‌లో ఉన్నాయి. CCPA నోటీసుకు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంపెనీ 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. CCPA నుంచి నోటీస్‌ అందుకున్న విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్‌ ధృవీకరించింది. కంపెనీ ఆర్థిక విషయాలపై గానీ, తమ రోజువారీ కార్యక్రమాలపై గానీ ఆ నోటీస్‌ ప్రభావం ఉండదని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్ట్రీ పిడుగు
బిజినెస్ టుడే రిపోర్ట్‌‌ ప్రకారం, తాజాగా, కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగుతోంది. సేవా లోపాలకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నుంచి వివరణ కోరే అవకాశముంది. నివేదిక కోరడంతోనే సరిపెట్టకుండా, మంత్రిత్వ శాఖ కూడా స్వయంగా ప్రాథమిక విచారణ చేయవచ్చని సమాచారం. మరో 3-4  రోజుల్లోనే ఇది జరగొచ్చని తెలుస్తోంది.

ఒకవైపు వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో కంపెనీ వాటా నెలనెలా తగ్గుతూ వస్తోంది. బజాజ్ ఆటో (Bajaj Auto), టీవీఎస్ మోటార్స్‌ (TVS Motors) సేల్స్‌లో దూసుకెళ్తున్నాయి. అవి, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటాను వేగంగా చేజిక్కించుకుంటున్నాయి. 

ఇన్ని ఒడుదొడుకుల మధ్య, మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో, ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ షేర్‌ ప్రైస్‌ (Ola Electric Share Price) 5.05 శాతం పెరిగింది. నిన్న (మంగళవారం) ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత షేర్‌ ధర రూ.86 వరకు పడిపోయింది, అయితే దిగువ స్థాయి నుంచి రికవరీ కనిపించింది, మంచి లాభంలో ముగిసింది.  

మరో ఆసక్తికర కథనం: భార్య పేరు చెప్పుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు - లక్షల్లో డబ్బు ఆదా! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget