అన్వేషించండి

Mukesh Ambani: ముకేశ్ అంబానీ బిగ్ జంప్, టాప్-10 సంపన్నుల జాబితాలోకి రీ ఎంట్రీ

ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో చేరారు, ఇప్పుడు 9వ ర్యాంక్‌లో ఉన్నారు.

Mukesh Ambani: భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సంపద విలువ పెరిగింది. కుబేరుల జాబితాలో హై జంప్ చేసి, 3 స్థానాలు ఎగబాకారు. 

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా  (Forbes Realtime Billionaires List) ప్రకారం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ టాప్ టెన్‌లోకి (Top-10) మళ్లీ చేరుకున్నారు. ఆయన నికర విలువ (Mukesh Ambani Networth) 657 మిలియన్లు తగ్గినప్పటికీ ప్రపంచంలోని తొలి 10 మంది ధనవంతుల జాబితాలో స్థానం పొందారు.

ముఖేష్ అంబానీది ఇప్పుడు ఏ నంబర్‌?
ముఖేష్ అంబానీ భారతదేశం మాత్రమే కాదు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో చేరారు, ఇప్పుడు 9వ ర్యాంక్‌లో ఉన్నారు. 
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల లిస్ట్‌లో మొదటి స్థానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఆక్రమించారు, ఆయన మొత్తం ఆస్తుల విలువ 211.2 బిలియన్‌ డాలర్లు. ట్విట్టర్‌, టెస్లా సహా చాలా ప్రపంచ స్థాయి కంపెనీల CEOగా ఉన్న ఎలాన్ మస్క్ ‍‌(Elon Musk) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు, ఆయన వ్యక్తిగత మొత్తం సంపద విలువ 188.6 బిలియన్‌ డాలర్లు. అమెజాన్ CEO జెఫ్ బెజోస్ ‍‌(Jeff Bezos) మూడో అత్యంత ధనవంతుడు, ఆయన ఆస్తుల నికర విలువ 120.8 బిలియన్ డాలర్లు

ముఖేష్ అంబానీ సంపద విలువ ఎంత?
ప్రపంచంలోని 9వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన ముఖేష్ అంబానీ సంపద ఇటీవల పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముకేష్‌ అంబానీ మొత్తం నికర విలువ 82.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖేష్ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ద్వారా 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

గౌతమ్ అదానీ ఏ స్థానంలో ఉన్నారు?
బిలియనీర్ల జాబితాలో ఒకప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ యజమాని గౌతమ్‌ అదానీ (Gautam Adani) వ్యక్తిగత ఆస్తి భారీగా తగ్గింది. గౌతమ్ అదానీ ఇప్పుడు సంపన్నుల జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం ఆస్తులు 58 బిలియన్ డాలర్లు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా లేదా ఏకంగా 49% క్షీణించింది.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిలీజ్‌ చేసిన నివేదికపై 'సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఒక విచారణ కమిటీ'ని వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ‍సహా మొత్తం స్టాక్‌ మార్కెట్‌లో లక్షల కోట్లు రూపాయల సంపద ఆవిరి కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, దురుద్దేశ పూర్వకంగానే ఇచ్చినట్టు నిరూపించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం, అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన న్యాయసంస్థ వాచ్‌టెల్‌ను అదానీ గ్రూప్‌ సంప్రదించినట్లు సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget