అన్వేషించండి

Maruti Suzuki: గ్రాండ్‌ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్‌

లోపాన్ని సరిచేసేందుకు 11 వేల 177 గ్రాండ్‌ విటారా కార్లను మారుతి సుజుకీ మేనేజ్‌మెంట్‌ వెనక్కి పిలిపిస్తోంది.

Maruti Suzuki: మన దేశంలో కార్ల తయారు చేసే అతి పెద్ద కంపెనీ మారుతి సుజుకీ, తన కార్లను వెనక్కు పిలుపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కొన్ని మోడళ్ల రీకాల్‌లో.. గ్రాండ్‌ విటారా కార్ల రీకాల్‌ ఒక భాగం.

గ్రాండ్‌ విటారా (Maruti Grand Vitara) కార్లలో ఒక లోపం మారుతి సుజుకీ దృష్టికి వచ్చింది. ఈ కార్లలో వెనుక సీట్‌కు ఉన్న బెల్ట్‌ మౌంటింగ్‌ బ్రాకెట్లు సరిగా పని చేయడం లేదని కంపెనీ గుర్తించింది. ఆ లోపాన్ని సరిచేసేందుకు 11 వేల 177 గ్రాండ్‌ విటారా కార్లను మారుతి సుజుకీ మేనేజ్‌మెంట్‌ వెనక్కి పిలిపిస్తోంది. ఈ మేరకు మారుతి సుజుకీ సోమవారం (23 జనవరి 2023) అధికారిక ప్రకటన చేసింది. 

గత ఏడాది (2022) ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన గ్రాండ్‌ విటారా మోడల్‌ కార్లలో ఈ లోపాన్ని కంపెనీ గుర్తించింది. లోపాలున్న భాగాలను మరమ్మతు చేసి లేదా మార్చి తిరిగి కస్టమర్‌కు అప్పగిస్తుంది.

ఒక్క గ్రాండ్‌ విటారా మోడలే కాదు, మారుతి ఆల్టో K10 (Maruti Alto K10), బ్రెజా (Maruti Brezza), బ్యాలెనో (Maruti Baleno), ఎస్‌-ప్రెసో (Maruti S-presso), ఈకో (Maruti Suzuki Eeco) గ్రాండ్‌ విటారా (Maruti Grand Vitara) మోడళ్ల కార్లలో ఎయిర్‌ బ్యాగ్‌ (Maruti Car Air bag) కంట్రోలర్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కంపెనీ గుర్తించింది. 

మొత్తం 17,362 కార్ల రీకాలింగ్‌
పైన చెప్పుకున్న మోడళ్లలోని అన్ని కార్లలో కాకుండా, 2022 ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన కొన్ని బ్యాచ్‌ల కార్లలోనే ఈ లోపానికి అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. లోపం ఉన్న కార్లను గుర్తింపును పూర్తి చేసిన మారుతి సుజుకీ, గ్రాండ్‌ విటారాతో కలిపి మొత్తం 17,362 కార్లను వెనక్కు (Cars Recall) పిలిపించే ప్రయత్నాల్లో ఉంది. ఆయా కార్ల యజమానులను గుర్తించి, కార్లను తెచ్చి అప్పగించమని అడుగుతోంది. దఫదఫాలుగా ఈ ప్రాసెస్‌ను పూర్తి చేస్తుంది. కస్టమర్లు తిరిగి తీసుకొచ్చిన కార్ల ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌ లేదా వెనుక సీట్‌ బెల్ట్‌ మౌంటింగ్‌ బ్రాకెట్లలో లోపాన్ని సవరించి, తగిన మార్పులు చేసి తిరిగి కస్టమర్లకు అప్పగిస్తుంది. 

కార్ల ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌ లేదా వెనుక సీట్‌ బెల్ట్‌ మౌంటింగ్‌ బ్రాకెట్లను తనిఖీ చేయడం దగ్గర నుంచి, ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దానిని సవరించి తిరిగి కస్టమర్‌కు అప్పగించడం వరకు అన్ని పనులూ పూర్తి ఉచితంగా చేస్తామని, ఒక్క రూపాయి కూడా వసూలు చేయబోమని మారుతి సుజుకీ తెలిపింది. 

ఒకవేళ కార్లలో ఈ లోపం ఉండి, దానిని మరమ్మతు చేయకపోతే.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌ బ్యాగ్‌లు, సీట్‌ బెల్ట్‌లు పని చేయకపోవచ్చని, ఇది కూడా అరుదుగా జరుగుతుందని మారుతి సుజుకీ గతంలోనే తెలిపింది. 2022 డిసెంబరు 8వ తేదీ నుంచి 2023 జనవరి 12వ తేదీల మధ్య తయారైన కార్లను కొన్న వారికి కంపెనీ నుంచి కాల్‌ వస్తుందని వెల్లడించింది. అశ్రద్ధ చేయకుండా తక్షణం కార్లను తెచ్చి కంపెనీకి అప్పగించమని కోరింది. ఒకవేళ ఆ కార్‌ ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌లో లోపం ఉందని తేలితే, ఆ లోపాన్ని సరి చేసేవరకు ఆ కారును నడపొద్దని కస్టమర్ల ఈ కంపెనీ సూచించింది.

రెండోసారి రేట్లు పెంచిన మారుతి
మరోవైపు... ఈ నెల 16వ తేదీ (జనవరి 16, 2023) నుంచి అన్ని మోడళ్ల ధరలను మారుతి సుజుకీ పెంచింది. కార్‌ రేట్లను ఈ కంపెనీ పెంచడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. 2022 ఏప్రిల్‌లో నెలలో రేట్లు పెంచింది. మోడల్‌ను బట్టి.. 1.1 శాతం వరకు మారుతి కారు ధర పెరిగింది. వాహనం తయారీకి ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరగడంతో పాటు, కొత్త ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహనాల్లో మార్పులు చేయాల్సి వచ్చినందున మరోమారు పెంపు తప్పడం లేదని మారుతి సుజుకీ ప్రకటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget