అన్వేషించండి

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఏయే పత్రాలు అవసరం?

మెచ్యూరిటీ డేట్‌ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని భావిస్తే, ఎల్‌ఐసీకి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని 'పాలసీని సరెండర్ చేయడం' అంటారు.

LIC Policy Surrender Value: పెట్టుబడుల కోసం మార్కెట్లో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎల్‌ఐసీ పాలసీ ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీల ద్వారా పెట్టుబడి పెట్టడాన్ని అత్యంత సురక్షిత మార్గంగా భారతదేశంలో ఎక్కువ మంది భావిస్తారు, వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మన దేశంలో కొన్ని కోట్ల మంది కనీసం రెండు కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు. పేదలు కూడా కనీసం ఒక పాలసీ అయినా కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. పెట్టుబడితో పాటు జీవిత బీమా సౌకర్యాన్ని కూడా పొందడం. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, ఈ పాలసీ బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుంది. 

కొనసాగుతున్న పాలసీకి ఇకపై డబ్బులు కట్టలేని పరిస్థితిలో పాలసీదారు ఉన్నా, లేదా అకస్మాత్తుగా డబ్బు అవసరమైనా, పాలసీ కోసం కట్టిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకోవచ్చు. అంటే, డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఆ పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 సంవత్సరాల తర్వాతే సరెండర్‌ చేయాలి
మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని మీరు భావిస్తే, ఎల్‌ఐసీకి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని 'పాలసీని సరెండర్ చేయడం' అంటారు. అయితే, ప్రతి పాలసీకి మూడు సంవత్సరాల లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ఉంటుంది. అంటే, మీరు ఒక పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు సరెండర్‌ చేయడానికి పాలసీ రూల్స్ ఒప్పుకోవు. మూడు తర్వాత మాత్రమే మీ పాలసీని సరెండర్‌ చేయడానికి వీలవుతుంది. 3 సంవత్సరాల తర్వాత సరెండర్‌ చేస్తే, అప్పటి వరకు మీరు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి పొందుతారు. దీనినే సరెండర్ విలువగా పిలుస్తారు.

ఎంత డబ్బు తిరిగి వస్తుంది?
మెచ్యూరిటీ తేదీకి ముందే ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయడం వల్ల ఖాతాదార్లకు చాలా నష్టం జరుగుంది, సరెండర్‌ విలువ భారీగా తగ్గుతుంది. మీ పాలసీ రెగ్యులర్ అయితే, 3 సంవత్సరాల పాటు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా సరెండర్‌ విలువను లెక్కిస్తారు. పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు ఆ పాలసీని సరెండర్ చేస్తే, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అందుకే, పాలసీ తేదీ నుంచి తొలి మూడేళ్ల కాలాన్ని లాక్‌-ఇన్‌ పిరియడ్‌ అని చెప్పింది.

మీరు 3 సంవత్సరాలు లేదా అంతకుమించి మీ ఎల్‌ఐసీ పాలసీకి ప్రీమియం చెల్లించినట్లయితే, సరెండర్ విలువ పొందడానికి మీరు అర్హులు అవుతారు. అయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 30% మాత్రమే తిరిగి పొందుతారు. మొదటి సంవత్సరంలో మీరు చెల్లించిన ప్రీమియంను సున్నాగా పరిగణిస్తారు.

పాలసీని సరెండర్‌ చేయడానికి అవసరమైన పత్రాలు
LIC పాలసీ ఒరిజినల్‌ బాండ్ డాక్యుమెంట్, సరెండర్ వాల్యూ చెల్లింపు కోసం అభ్యర్థన పత్రం, ఎల్‌ఐసీ సరెండర్ ఫారం 5074, ఎల్‌ఐసీ నెఫ్ట్‌ ఫారం, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ ID రుజువు, క్యాన్సిల్‌ చేసిన బ్యాంక్ చెక్, LIC పాలసీని ముందుస్తుగానే మూసివేయడంపై రాతపూర్వక వినతి పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget