By: ABP Desam | Updated at : 27 Dec 2022 11:23 AM (IST)
Edited By: Arunmali
గృహ రుణాల వడ్డీ రేట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
LIC Home Loan Interest: ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోళ్లకు అప్పులు ఇచ్చే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance - LIC HFL), తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (LHPLR) సవరించి, వడ్డీ రేట్లను పెంచింది.
LIC హౌసింగ్ ఫైనాన్స్ జారీ చేసిన పత్రిక ప్రకటన ప్రకారం... 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం మేర రుణ రేటును ఈ కంపెనీ పెంచింది. గృహ రుణాల మీద పెంచిన వడ్డీ రేట్లు సోమవారం (డిసెంబర్ 26, 2022) నుంచి అమలులోకి వచ్చాయి. కనీస కొత్త వడ్డీ రేటు ఇప్పుడు 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
800 క్రెడిట్ స్కోర్ దాటితే భలే ఆఫర్
LIC హౌసింగ్ వెబ్‌సైట్ ప్రకారం... మంచి క్రెడిట్ స్కోర్ (Good Credit Score) ఉన్న వాళ్లకు LIC హౌసింగ్ ఫైనాన్స్ రుణాల్లో కాస్త రిబేటు ఉంటుంది.
ఉద్యోగం ద్వారా వచ్చే జీతం (salaried people) లేదా వృత్తిపరమైన ఆదాయం (self-employed people) సంపాదిస్తూ, 800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు.. రూ. 15 కోట్ల వరకు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు 8.30 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
ఉద్యోగం ద్వారా వచ్చే జీతం లేదా వృత్తిపరమైన ఆదాయం సంపాదిస్తూ, 750- 799 మధ్య క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వాళ్లకు... రూ. 5 కోట్ల వరకు ఇచ్చే రుణాల మీద 8.40 శాతం వడ్డీ రేటు & రూ. 5 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఇచ్చే రుణాల మీద 8.60 శాతం వడ్డీ ఉంటుంది.
ఉద్యోగం ద్వారా వచ్చే జీతం లేదా వృత్తిపరమైన ఆదాయం సంపాదిస్తూ, క్రెడిట్ స్కోర్ 700 -749 మధ్య ఉన్న వాళ్లకు ఇచ్చే రూ. 50 లక్షల వరకు విలువైన రుణాల మీద 8.70 శాతం వడ్డీ రేటు విధిస్తారు. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఇచ్చే రుణఆల మీద 8.90 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తారు.
LIC హౌసింగ్ వెబ్‌సైట్ ప్రకారం... గరిష్ట రుణ మొత్తం &లోన్ రీపేమెంట్ పిరియడ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది:
గరిష్ట రుణ మొత్తం:
రూ. 30 లక్షల వరకు రుణాల విషయంలో... ఆస్తి విలువలో 90 శాతాన్ని రుణంగా ఇస్తారు
రూ. 30 లక్షల కంటే ఎక్కువ - రూ. 75 లక్షల వరకు ఉన్న రుణాలకు ఆస్తి విలువలో 80 శాతం
రూ. 75 లక్షల కంటే ఎక్కువ రుణం కేసుల్లో ఆస్తి విలువలో 75 శాతం రుణం
రుణాన్ని తిరిగి చెల్లించే కాలం:
జీతం తీసుకునే వాళ్లకు గరిష్ట రీపేమెంట్ వ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది
స్వయం ఉపాధి పొందే వాళ్లకు గరిష్ట రీపేమెంట్ వ్యవధి 25 సంవత్సరాల వరకు ఉంటుంది
LIC HFL అందించే గృహ రుణాల రకాలు:
భారత పౌరుల కోసం గృహ రుణం
NRI కోసం గృహ రుణం
ఖాళీ స్థలాల కొనుగోలు కోసం రుణం
గృహ నవీకరణ కోసం రుణం
గృహ పునరుద్ధరణ కోసం రుణం
టాప్ అప్ లోన్
లోన్ బదిలీ కోసం రుణం (Balance transfer loan)
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్