Gold-Silver Prices Today 12 Nov: నెల క్రితం రేటుతో ఇప్పుడు గోల్డ్ కొనొచ్చు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 1,01,900 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,390 వద్ద ఉంది.
Latest Gold-Silver Prices 12 November 2024: భవిష్యత్ వడ్డీ రేట్ల కోతలపై యూఎస్ ఫెడ్ అధికారుల వ్యాఖ్యలు, ఆ దేశంలో ఆర్థిక డేటా మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ఒక నెల కనిష్టానికి పడిపోయింది. అంటే, నెల క్రితం ఉన్న రేటు ఇప్పుడు నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో, ప్రస్తుతం, ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,622 డాలర్ల వద్ద ఉంది. ఈ ప్రభావం మన దేశ బులియన్ మార్కెట్‌పైనా పడింది. ఈ రోజు, మన దేశంలో, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర కేవలం 10 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ఏకంగా 100 రూపాయలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,750 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,190 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,060 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,01,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,750 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,190 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 72,190 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,01,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 78,750 | ₹ 72,190 | ₹ 72,190 | ₹ 1,01,900 |
విజయవాడ | ₹ 78,750 | ₹ 72,190 | ₹ 72,190 | ₹ 1,01,900 |
విశాఖపట్నం | ₹ 78,750 | ₹ 72,190 | ₹ 72,190 | ₹ 1,01,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,219 | ₹ 7,875 |
ముంబయి | ₹ 7,219 | ₹ 7,875 |
పుణె | ₹ 7,219 | ₹ 7,875 |
దిల్లీ | ₹ 7,234 | ₹ 7,890 |
జైపుర్ | ₹ 7,234 | ₹ 7,890 |
లఖ్‌నవూ | ₹ 7,234 | ₹ 7,890 |
కోల్‌కతా | ₹ 7,219 | ₹ 7,875 |
నాగ్‌పుర్ | ₹ 7,219 | ₹ 7,875 |
బెంగళూరు | ₹ 7,219 | ₹ 7,875 |
మైసూరు | ₹ 7,219 | ₹ 7,875 |
కేరళ | ₹ 7,219 | ₹ 7,875 |
భువనేశ్వర్ | ₹ 7,219 | ₹ 7,875 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,042 | ₹ 7,605 |
షార్జా (UAE) | ₹ 7,042 | ₹ 7,605 |
అబు ధాబి (UAE) | ₹ 7,042 | ₹ 7,605 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,101 | ₹ 7,561 |
కువైట్ | ₹ 6,816 | ₹ 7,436 |
మలేసియా | ₹ 7,041 | ₹ 7,386 |
సింగపూర్ | ₹ 7,014 | ₹ 7,722 |
అమెరికా | ₹ 6,920 | ₹ 7,342 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 60 పెరిగి రూ. 26,660 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు