అన్వేషించండి

Joint Venture: కొత్త బిజినెస్‌లోకి జియో ఫిన్‌, ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందట!

నూతన వ్యాపారం కోసం, అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ బ్లాక్‌రాక్ కలిసి పని చేయాలని నిర్ణయించింది.

Jio Fin Services - Blackrock Joint Venture: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JFSL) మరో కొత్త బిజినెస్‌ ఆలోచనలో ఉంది. నూతన వ్యాపారం కోసం, అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ బ్లాక్‌రాక్ కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఈ రెండు కంపెనీలు కలిసి 50-50 శాతం వాటాతో జాయింట్ వెంచర్‌ (JV) ఏర్పాటు చేయనున్నాయి. ఈ JVలో.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ - బ్లాక్‌రాక్‌, బ్లాక్‌రాక్‌ అడ్వైజర్స్ సింగపూర్ పీటీఈ ఉంటాయి.  జాయింట్ వెంచర్‌ను సోమవారం నాడు ప్రకటించారు.

సంపద నిర్వహణ, దళారీ పని
జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ - బ్లాక్‌రాక్‌ కలిసి ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీ "వెల్త్ మేనేజ్‌మెంట్ & బ్రోకింగ్‌" కంపెనీగా పని చేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. JFSL వెల్లడించిన డేటా ప్రకారం, ఈ భాగస్వామ్యానికి 2023 జులై 26లోనే పునాది పడింది. 

అసెట్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో మార్పు తీసుకువచ్చేలా, బలమైన ముద్ర వేసేలా ఈ జాయింట్ వెంచర్ పని చేస్తుంది. వినియోగదార్లకు పెట్టుబడికి సంబంధించిన విభిన్న పద్ధతులు అందించడానికి ప్రయత్నిస్తాం. ఇందుకోసం డిజిటల్ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెడతాం. సంపద నిర్వహణ, బ్రోకరేజ్ వ్యాపారం ప్రారంభించడానికి సెబీ ఆమోదం రావలసివుంది. - జియో ఫైనాన్షియల్ సర్వీసెస్

నిన్న ‍(సోమవారం, 15 ఏప్రిల్‌ 2024) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్‌ ధర BSEలో దాదాపు 4.82 శాతం క్షీణించి రూ. 354.40 వద్ద ముగిసింది.

మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం ఎదురుచూపులు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ - బ్లాక్‌రాక్‌ కలిసి ఇప్పటికే ఒక జేవీని ఏర్పాటు చేశాయి, ఇది ఒక మ్యూచువల్‌ ఫండ్‌ (MF) కంపెనీ. దీనికి లైసెన్స్‌ కోసం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి గత ఏడాది అక్టోబర్‌లో దరఖాస్తు సమర్పించాయి. ప్రస్తుతం, సెబీ నుంచి అనుమతి కోసం ఈ జేవీ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో, బ్లాక్‌రాక్‌తో కలిసి మరో జేవీని ఏర్పాటు చేస్తుండడం విశేషం. 

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఆర్థిక సేవలు అందించే సంస్థ. గతంలో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అనుబంధ సంస్థగా ఉంది. గత ఏడాది ఆగస్టులో రిలయన్స్‌ నుంచి విడిపోయి, స్వతంత్ర సంస్థగా భారత స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయింది. బ్లాక్‌రాక్‌ ఇంక్‌ అనేది అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ కంపెనీ AUM సుమారు 10 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Jio Fin, Cipla, Vi, Vedanta 

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget