అన్వేషించండి

Jio AirFiber: హైదరాబాద్‌లో జియో ఎయిర్‌ఫైబర్‌ - అతి తక్కువ ధర ప్లాన్‌ ఇదే!

Jio AirFiber: రిలయన్స్‌ జియో మంగళవారం జియో ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది.

Jio AirFiber:

రిలయన్స్‌ జియో మంగళవారం జియో ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌కు గట్టిపోటీనివ్వడానికి సిద్ధమైంది. ఇంతకు ముందే భారతీ ఎయిర్‌టెల్‌ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (FWA) కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ సేవలను దిల్లీ, ముంబయి నగరాల్లో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌టెల్‌కు పోటీ

జియో, ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ ఫైబర్‌ ఇన్‌స్టలేషన్‌కు రూటర్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు అవసరం లేదు. కేవలం ఒక పరికరాన్ని ఇంట్లో పెట్టుకుంటే నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సేవలను పొందొచ్చు. నేటి నుంచి దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణె నగరాల్లో జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కనీస ధరను రూ.599, గరిష్ఠ ధరను రూ.3,999గా నిర్ణయించారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌లో లభించే సేవలే జియోలోనూ అందుబాటులో ఉంటాయని తెలిసింది. హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాడ్‌బ్యాండ్‌, డిజిటల్‌ సర్వీసులు అందిస్తుంది.

ప్లాన్ల వివరాలు

రిలయన్స్‌ జియో ఎయిర్‌ ఫైబర్‌లో 550 డిజిటల్‌ టీవీ ఛానళ్లు, క్యాచప్‌ టీవీ, ఓటీటీ సేవలూ ఉంటాయి. చెల్లించే ధర, ప్లాన్‌ను బట్టి 16 ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. టీవీ, ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌, టాబ్లెట్‌లో స్ట్రీమింగ్‌ సౌకర్యం పొందొచ్చు. 'దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ మేం నాణ్యమైన డిజిటల్‌ సేవలను అందిస్తాం. మార్కెట్‌ను వేగంగా పెంచుకుంటాం. జియో ఫైబర్‌తో ప్రపంచ స్థాయి డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్మార్ట్‌ హోమ్‌ సర్వీసులు, బ్రాడ్‌బ్యాండ్‌ పొందొచ్చు. విద్య, ఆరోగ్యం, వైద్యం, నిఘా, స్మార్ట్‌ హోమ్‌కు ఇది ఉపయోగపడుతుంది' అని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

కనెక్షన్‌ పొందడం ఎలా?

జియో ఎయిర్ ఫైబర్‌ కనెక్షన్‌ పొందడం సులభమే. వాట్సప్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. 60008-60008కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. లేదా www.jio.com వెబ్‌సైట్‌, సమీపంలోని జియో స్టోర్‌ను విజిట్‌ చేయొచ్చు. కనెక్షన్‌ కోసం బుకింగ్‌ చేసుకున్నాక యూజర్లు జియో ఎయిర్‌ ఫైబర్‌ సర్వీసుల కోసం రిజిస్టర్‌ అవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే జియో ప్రతినిధులు మీ ఇంటికి వచ్చిన జియె ఎయిర్‌ ఫైబర్‌ కనెక్షన్‌ ఇస్తారు.

గణనీయమైన ఇంటర్నెట్ వేగం

జియో ఎయిర్ పైబర్ 1.5Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. జియో పైబర్ అత్యధికంగా 1 Gbps వరకు వేగాన్ని అందిస్తున్నది. అయితే, ఆయా ప్రాంతాల్లోని జియో టవర్ సిగ్నల్‌ను బట్టి వేగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

జియో ఎయిర్ పైబర్ తో పెరగనున్న కవరేజ్

జియో ఫైబర్ కవరేజీ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని అన్ని ప్రాంతాలకు పూర్తిగా చేరుకోలేదని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో జియో ఎయిర్ పైబర్ వైర్‌లెస్ టెక్నాలజీ సహాయంతోమూరుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశం ఉంటుంది. 

జియో ఫైబర్ అందించే 1.5 Gbps ఇంటర్నెట్ వేగంతో ఆయా పనులను మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎలాంటి అంతరాయాలు లేకుండా HD వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్,  వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. 2023లో  వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఈ సేవలను వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జియో ఎయిర్ పైబర్ లో పేరెంట్స్ కంట్రోల్స్, 6 Wi – Fi సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌ వాల్ సహా పలు అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Embed widget