అన్వేషించండి

Human Lunar Mission: నాసాకు బెజోస్ బంపర్ ఆఫర్.. ఆ ప్రాజెక్ట్ కోసం రూ.15 వేల కోట్లు!

అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు భారీ ఆఫర్‌ ఇచ్చారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఓ ప్రాజెక్ట్ ను బ్లూ ఆరిజన్ సంస్థకు ఇస్తే దాదాపు రూ. 15 వేల కోట్లు డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు.

అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు భారీ ఆఫర్‌ ఇచ్చారు. 2024లో చంద్రునిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్‌ సిస్టం(హెచ్‌ఎల్‌ఎస్‌)ను బ్లూ ఆరిజిన్‌ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ ఎక్స్‌'తో ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్‌ ఇస్తామని బంపర్ ఆఫర్‌ ప్రకటించారు.

పైరవీలు..

ఈ ఒప్పందాన్ని స్పేస్‌ ఎక్స్‌కు మాత్రమే అప్పగించడాన్ని నిరసిస్తూ బ్లూ ఆరిజిన్‌తో పాటు మరో సంస్థ డైనెటిక్స్‌ అమెరికా ప్రభుత్వంలో సంబంధిత శాఖను ఆశ్రయించాయి. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. తన ప్రతిపాదన నిధుల కొరతను తీరుస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌కు రాసిన లేఖలో బెజోస్‌ తెలిపారు. తాను ఇస్తానంటున్న ఆఫర్‌ వాయిదా పద్దతి కాదని.. శాశ్వతంగా 2 బిలియన్ డాలర్లు రద్దు చేస్తామని వివరించారు. ఈ ఒప్పందాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్‌ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిధుల కేటాయింపునుకు సంబంధించిన బిల్లుపై అక్కడి సెనేట్‌లో చర్చ జరుగుతోంది.

ఈ కాంట్రాక్ట్‌ను 'బ్లూ ఆరిజిన్‌'కు ఇవ్వడం వల్ల డిస్కౌంట్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు బెజోస్‌ తెలిపారు. తాము తయారు చేయబోయే 'బ్లూ మూన్‌ ల్యాండర్‌' లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడిచేలా రూపొందించనున్నామన్నారు. ల్యూనార్‌ ఐస్‌ నుంచి సైతం దీనికి ఇంధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సౌరవ్యవస్థలో మరింత లోపలికి ప్రయాణించడానికి సైతం ఇది ఉపయోగపడుతుందన్నారు. పైగా ఈ ల్యాండర్‌ను తమ సొంత ఖర్చుతో భూ కక్ష్యలో పరీక్షిస్తామని స్పష్టం చేశారు. చంద్రుడిపైకి మానవసహిత యాత్రలోని నిధుల కొరత సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. తద్వారా మిషన్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి స్పేస్‌ ఎక్స్‌తో కుదిరిన ఒప్పందంపై బెజోస్‌ ప్రతిపాదన ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

అందుకోసమే..

స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన వ్యోమనౌక 'క్రూ డ్రాగన్‌' ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చింది. మరోవైపు బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌకలో ఇటీవలే బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి వచ్చారు. దీంతో అంతరిక్షయాన రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. భవిష్యత్తుల్లో ఇవి పర్యటక యాత్రలుగా మారి ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో నాసా తాజా ప్రాజెక్టును దక్కించుకోవడం వల్ల ఈ రంగంపై పట్టుసాధించి పై చేయి పొందవచ్చని బెజోస్‌ తహతహలాడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget