News
News
X

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ స్కోర్‌ ఉంటుందని అనుకోవడం అపోహ. చాలా తక్కువ సంపాదించేవాళ్ల క్రెడిట్‌ స్కోర్‌ కూడా హై రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

FOLLOW US: 
 
CIBIL Credit Score: ఈ భూమ్మీద పుట్టాక, అప్పు అవసరం లేని వ్యక్తి 99.99% ఉండడు. అంబానీ, అదానీల దగ్గర్నుంచి అత్యంత సామాన్యుడి వరకు అందరికీ అప్పు లేనిదే గడవదు. సంసార సాగరమైనా, వ్యాపార భారమైనా చేబదుళ్లతో కొంతమేర అవసరాలు తీరొచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే మాత్రం ఆర్థిక సంస్థలే ఆధారం. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు వంటి ఆర్థిక సంస్థల దగ్గరకు వెళ్తే, మన క్రెడిట్‌ స్కోర్‌ చూసి, సంతృప్తి చెందితేనే అవి రుణాలిస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే ముందు వరుసలో కూర్చోబెట్టి మర్యాద చేస్తాయి, స్కోర్‌ తక్కువగా ఉంటే మర్యాదగా గెటౌట్‌ అంటాయి.

క్రెడిట్‌ స్కోర్‌ అంటే ఏమిటి, మంచి స్కోర్‌ వల్ల ఉపయోగాలేంటో ఈ క్రింది లింక్‌ మీద క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

Also Read: మంచి క్రెడిట్‌ స్కోర్‌ అవసరమా, లేకపోతే నష్టమేంటి?

వ్యక్తిగత రుణం, ఇంటి రుణం (కట్టుకోవడానికి లేదా కొనడానికి), వాహన రుణం.. ఇలా ఎలాంటి టైపు అప్పును మీరు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ 700కి తక్కువగా ఉంటే ఆర్థిక సంస్థలు మీ దరఖాస్తును బుట్టదాఖలు చేయొచ్చు.

News Reels

ఎక్కువ సంపాదిస్తే స్కోర్‌ పెరుగుతుందా?
తెలిసో, తెలియకో ఆర్థిక పరంగా కొన్ని తప్పులు చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌ తగ్గుతుంది. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ స్కోర్‌ ఉంటుందని అనుకోవడం అపోహ. చాలా తక్కువ సంపాదించేవాళ్ల క్రెడిట్‌ స్కోర్‌ కూడా హై రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. మీ ఆదాయం, ఆస్తిపాస్తులతో క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధం లేదు. మీరు గతంలో తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లించారా, చెల్లిస్తున్నారా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఒకవేళ మీ స్కోరు తక్కువగా ఉంటే, దానిని పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం:

- రుణాలు తిరిగి చెల్లింపులను గడువు లోగా పూర్తి చేయాలి. క్రెడిట్ కార్డు బిల్లు కానీ, లోన్ EMI కానీ లాస్ట్‌ డేట్‌ లోపు చెల్లించండి. గుర్తులేకో, నిర్లక్ష్యం వల్లో గడువు దాటిందా.. ఆ ఎఫెక్ట్‌ క్రెడిట్ స్కోర్‌ మీద గట్టిగా పడుతుంది. అంతేకాదు, పెనాల్టీల రూపంలో అదనంగా చెల్లించాల్సి వస్తుంది కూడా.

- ఎక్కువ లోన్లు గానీ పర్సు నిండా క్రెడిట్ కార్డులు గానీ తీసుకోవద్దు. ఎక్కువ లోన్స్ లేదా ఎక్కువ కార్డులు మీ దగ్గరుంటే గుండెల మీద కుంపటి పెట్టుకున్నట్లే. పరిస్థితి తారుమారైతే రుణ ఎగవేతదారుల జాబితాలో మీరు చేరే ప్రమాదం ఉంటుంది. ఫైనల్‌గా క్రెడిట్ స్కోర్‌ ఎఫెక్ట్ అవుతుంది.

- సురక్షిత (సెక్యూర్డ్), అసురక్షిత (అన్‌ సెక్యూర్డ్‌) రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్‌, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌ సెక్యూర్డ్ లోన్స్‌గా ఆర్థిక సంస్థలు చూస్తాయి.

- మీరు క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తుంటే, క్రెడిట్ లిమిట్‌ మొత్తాన్నీ వాడేయొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం లోపు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. క్రెడిట్‌ కార్డును పూర్తిగా వాడేస్తే మీరు దుబారా మనిషని లేదా అందిన కాడికి అప్పులు చేస్తారని బ్యాంకులు భావించే ప్రమాదం ఉంది. పైగా అంత మొత్తం కట్టే పరిస్థితి ఒక్కోసారి ఉండకపోవచ్చు. 

- నెల నెలా మీరు చెల్లించే లోన్ EMIలు మీ నెలవారీ జీతం లేదా ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి.

- అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. రుణాలు లేదా క్రెడిట్‌ కార్డుల కోసం పదేపదే దరఖాస్తు చేయొద్దు. అంటే, తక్కువ సమయంలో ఎక్కువ అప్లికేషన్లు పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల, మీరేదో కొంప మునిగే అవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనుమానిస్తాయి.

చివరిగా..
రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లు దాదాపు కరెక్ట్‌గానే ఉంటాయి. అత్యంత అరుదుగా మాత్రమే వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబ్టిట, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి. ఒకవేళ ఏదైనా తప్పులు కనిపిస్తే, సాధ్యమైనంత త్వరగా వాటిని సరిచేయించుకోండి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ కథనం ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు గానీ, పర్యవసానాలకు గానీ ఏబీపీ దేశం బాధ్యత వహించదు.

Published at : 24 Sep 2022 01:43 PM (IST) Tags: credit score Credit Card CIBIL Score Good Credit Score Credit rating

సంబంధిత కథనాలు

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

EPF Wage Ceiling Limit: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?

EPF Wage Ceiling Limit: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?

Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్‌ కొంటే, మార్కెట్‌ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!

Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్‌ కొంటే, మార్కెట్‌ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!

Stock Market Opening: ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాల్లో సూచీలు - పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌

Stock Market Opening: ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాల్లో సూచీలు - పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌

Car Sales In November: నవంబర్‌ నెలలోనూ కార్‌ సేల్స్‌లో హై స్పీడ్‌ - టాప్‌ గేర్‌లో మారుతి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌

Car Sales In November: నవంబర్‌ నెలలోనూ కార్‌ సేల్స్‌లో హై స్పీడ్‌ - టాప్‌ గేర్‌లో మారుతి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?