అన్వేషించండి

IRCTC WhatsApp Food Delivery: రైలు ప్రయాణంలోనూ వాట్సాప్‌ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టొచ్చు.. కొత్త సేవ గురూ!

టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టకపోయినా పర్లేదు, ఆ తర్వాత రైలు ప్రయాణ సమయంలో ఎప్పుడైనా ఆహారం ఆర్డర్‌ పెట్టేలా నయా సర్వీసును ప్రారంభించింది.

IRCTC WhatsApp Food Delivery: ప్రయాణీకులకు చేరువ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలను వెదుక్కుంటున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో కొత్త సేవతో ప్రయాణీకుల ముందుకు వచ్చింది. టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టకపోయినా పర్లేదు, ఆ తర్వాత రైలు ప్రయాణ సమయంలో ఎప్పుడైనా ఆహారం ఆర్డర్‌ పెట్టేలా నయా సర్వీసును ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌ (WhatsApp) చాట్‌ను ఉపయోగించుకుంటోంది. 

వాట్సాప్‌ ఆధారంగా ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టేలా సేవలను తీసుకొచ్చిన మొదటి, ఏకైక (ఇప్పటివరకు) ప్లాట్‌ఫాం ఇదే కావడం విశేషం.

రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టేలా ఫుడ్ డెలివరీ యాప్ "జూప్‌"ను (Zoop) ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. వాట్సాప్‌ ద్వారా ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్ చేయడంలో ఈ యాప్ సాయపడుతుంది. టిక్కెట్‌పై ఉండే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్' (PNR) నంబర్‌ను ఉపయోగించి ప్రయాణీకులు ఈ సేవను పొందవచ్చు. 

ఐఆర్‌సీటీసీ, జియో హాప్టిక్‌ (Jio Haptik‌) భాగస్వామ్యంలో జూప్‌ యాప్‌ వచ్చింది. ఈ యాప్‌లో చాట్‌ చేస్తూ (చాట్‌బాట్ సర్వీస్‌) చాలా సులభంగా, కొన్ని స్టెప్స్‌లోనే ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. వాట్సాప్‌ చాట్ నుంచి మరొక లింక్‌కి ప్రయాణీకులను మళ్లించబడం జరగదు. ఈ చాట్‌లోనే ఆహారాన్ని ఆర్డర్ పెట్టవచ్చు. అంతేకాదు, ఇలా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ప్రయాణికులు ఎలాంటి అదనపు యాప్ లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.

వాట్సాప్‌ చాట్‌బాట్‌ పేరు జివా (Ziva). కస్టమర్‌లు తమ PNR నంబర్‌ ద్వారా ఫుడ్ ఆర్డర్‌ పెట్టడమే కాదు, ఆర్డర్‌ ఏ దశలో ఉంది?, ఎంతసేపట్లో డెలివరీ అవుతుందన్న విషయాలను రియల్ టైమ్ ఆర్డర్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. జివాతో చాట్‌ చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు, సపోర్ట్‌ పొందవచ్చు. ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌ నేరుగా వారి సీట్ల వద్దకే డెలివరీ అవుతుంది.

వాట్సాప్‌ ద్వారా రైల్లో ఫుడ్‌ ఆర్డర్‌ ఇలా పెట్టొచ్చు..

సంప్రదించాల్సిన నంబర్‌
ప్రయాణీకులు 91 7042062070 నంబర్‌ ద్వారా వాట్సాప్‌లో జూప్‌తో చాట్ చేయవచ్చు. పెట్టిన ఆర్డర్ కన్ఫర్మ్‌ అయితే, ప్రయాణికులున్న సీట్లు లేదా బెర్త్‌ల దగ్గరకే ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తారు.

లొకేషన్‌ 
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సేవలు విజయవాడ, వడోదర, మొరాదాబాద్, వరంగల్, పండిత్‌ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌, కాన్పూర్, ఆగ్రా, తుండ్ల జంక్షన్, బల్లార్ష జంక్షన్ తోపాటు 100కు పైగా A1, A, B కేటగిరీ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి.

మెనులో ఏ వంటకాలు ఉంటాయి?
ఐఆర్‌సీటీసీ అందించే వివిధ రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను వాట్సాప్‌ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మనకు మెనూ కనిపిస్తుంది. వాటితోపాటు వెజ్ థాలీ, రైతాతో కలిపి వెజ్ లేదా చికెన్ బిర్యానీ, స్టాండర్డ్ లేదా జైన్ స్పెషల్ థాలీని కూడా ఆర్డర్‌ పెట్టవచ్చు.

చెల్లింపు విధానం
జూప్‌ యాప్‌ ద్వారానే డబ్బు చెల్లించవచ్చు. ఈ విధానం కూడా సులభంగానే ఉంటుంది. కేవలం మూడు క్లిక్స్‌లో (3-click payment experience‌) డబ్బు చెల్లింపును పూర్తి చేయవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget