అన్వేషించండి

IRCTC Room Booking: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్‌ - హోటల్‌ గదిలా ఉంటుంది

విశ్రాంతి కోసం ఓ గది కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం వెదుక్కుంటూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

IRCTC Retiering Room Booking: మన దేశంలో, రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకుల కోసం ఇండియన్‌ రైల్వే చాలా ఫెసిలిటీస్‌ అందిస్తోంది. అయితే.. ట్రైన్‌ జర్నీ చేసేవాళ్లలో చాలా మందికి, రైల్వే శాఖ అందిస్తున్న చాలా సదుపాయాల గురించి తెలీడం లేదు. 

రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి, విశ్రాంతి కోసం ఓ గది కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం వెదుక్కుంటూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లలోనే అలాంటి ఫెసిలిటీ అందుబాటులో ఉంది. చాలా తక్కువ ఖర్చులోనే హోటల్ రూమ్‌ లాంటి గదిని బుక్‌ చేసుకోవచ్చు.

కేవలం 100 రూపాయలకే రూమ్‌ బుకింగ్‌
రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు బస చేసేందుకు హోటల్ తరహాలో గదులు ఏర్పాటు చేశారు. వాటిని రిటైరింగ్‌ రూమ్స్‌ (Retiering Rooms) అంటారు. ఇవి AC రూమ్‌లు. బెడ్ సహా ప్రయాణీకుల కోసం కొన్ని ఏర్పాట్లు రిటైరింగ్‌ రూమ్స్‌లో ఉంటాయి. రాత్రి పూట గదిని బుక్ చేసుకోవడానికి, ప్రాంతం/డిమాండ్‌ను బట్టి రూ. 100 నుంచి రూ. 700 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ రిటైరింగ్‌ రూమ్‌ ఎలా బుక్‌ చేయాలి?
ముందుగా, IRCTC అఫిషియల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్‌ పేజీలో, మీ యూజర్‌ ఐడీ & పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ అవ్వండి.
ఇప్పుడు, మై బుకింగ్స్‌లోకి వెళ్లండి
మీ టికెట్ బుకింగ్ దిగువన, రిటైరింగ్ రూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
దాని మీద క్లిక్ చేస్తే, గదిని బుక్ చేసుకునే ఆప్షన్‌ మీకు కనిపిస్తుంది
ఇక్కడ PNR నంబర్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు
కొంత వ్యక్తిగత సమాచారం, జర్నీ టైమ్‌ లాంటి డిటెల్స్‌ ఇవాల్సి ఉంటుంది
రూమ్‌ ఓకే చేసుకున్న తర్వాత పేమెంట్‌ చేయాలి
ఇక్కడితో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్‌ రూమ్‌ బుకింగ్‌ పూర్తవతుంది

45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్‌ చేయండి. దీనివల్ల, కేవలం 45 పైసలకే ₹10 లక్షల బీమా కవరేజ్‌ అందుతుంది. గాయపడిన వారికి కూడా బీమా కవరేజ్‌ ఉంటుంది.

రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నప్పుడు.. IRCTC వెబ్‌సైట్‌లో, యాప్‌లోనూ ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది. లింక్‌ మీద క్లిక్‌ చేస్తే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

ఎంత క్లెయిమ్ పొందుతారు?
రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పుడు, రైలు ప్రయాణ సమయంలో పాసెంజర్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయాలు అయితే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు.

భారతీయ రైల్వే అందిస్తున్న ఈ ఫెసిలిటీని మీరు గతంలో పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇకపై మాత్రం మరిచిపోవద్దు. మీరు చూపే చిన్నపాటి శ్రద్ధ, మీ కుటుంబానికి ఆర్థిక రక్ష.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget