IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్ రూమ్ లాంటి గది, 100 రూపాయలతో బుక్ చేయొచ్చు
హోటల్ రూమ్ కోసం వెదుక్కుంటూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
IRCTC Retiering Room Booking: మన దేశంలో, రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకుల కోసం ఇండియన్ రైల్వే చాలా ఫెసిలిటీస్ అందిస్తోంది. అయితే.. ట్రైన్ జర్నీ చేసేవాళ్లలో చాలా మందికి, రైల్వే శాఖ అందిస్తున్న చాలా సదుపాయాల గురించి తెలీడం లేదు.
మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉండి, కాసేపు కునుకు తీయడానికో; లేదా, స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి తప్పించుకుని కాసేపు విశ్రాంతి గడపడానికో ఒక గదిని కావాలనుకుంటే, హోటల్ రూమ్ కోసం వెదుక్కుంటూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. చాలా తక్కువ ఖర్చుతోనే హోటల్ రూమ్ లాంటి గదిలో మీరు గడపొచ్చు.
కేవలం 100 రూపాయలకే రూమ్ బుకింగ్
రైల్వే ప్రయాణీకులకు, ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణం చేసే వాళ్లకు రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను IRCTC ఏర్పాటు చేసింది. వాటిని రిటైరింగ్ రూమ్స్ (Retiering Rooms) అంటారు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ విభాగాల్లో రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. నిద్ర పోవడానికి బెడ్ ఇవ్వడం సహా ప్రయాణీకుల కోసం మరికొన్ని ఏర్పాట్లు ఈ గదుల్లో ఉంటాయి. ప్రాంతం/డిమాండ్‌ను బట్టి రూ. 100 నుంచి రూ. 700 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్ ఎలా బుక్ చేయాలి?
ముందుగా, IRCTC అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో, మీ యూజర్ ఐడీ & పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, 'My booking'లోకి వెళ్లండి
మీ టికెట్ బుకింగ్ దిగువన, ‘Retiring room’ అనే ఆప్షన్ కనిపిస్తుంది
దాని మీద క్లిక్ చేస్తే, గదిని బుక్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది
ఇక్కడ PNR నంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత, కొంత వ్యక్తిగత సమాచారం, జర్నీ టైమ్, స్టే చేయాలనుకున్న స్టేషన్ పేరు లాంటి డిటైల్స్ ఇవాల్సి ఉంటుంది
ఆ తర్వాత చెక్ ఇన్, చెక్ ఔట్ తేదీ సహా అక్కడ అడిగిన వివరాలను పూరించాలి
రూమ్ ఓకే చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి
ఇక్కడితో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్ బుకింగ్ పూర్తవతుంది
వీళ్లకు మాత్రమే రిటైరింగ్ రూమ్ ఫెసిలిటీ
రిటైరింగ్ రూమ్‌ను అందరికీ కేటాయించరు. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తులు మాత్రమే రిటైరింగ్ రూమ్‌ను బుక్ చేసుకోవటానికి వీలవుతుంది. ఒకవేళ మీ పేరు వెయిట్ లిస్ట్‌లో ఉంటే, ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి. వీటిని, టికెట్‌తో పాటే ఆన్‌లైన్ బుక్ చేసుకోవచ్చు. లేదా, కన్ఫర్మ్ అయిన టిక్కెట్ చూపించి రైల్వే స్టేషన్‌లో (ఆఫ్‌లైన్) నేరుగా బుక్ చేసుకోవచ్చు.
బుక్ చేసుకున్న గదిని క్యాన్సిల్ చేసుకోవచ్చా?
రిటైరింగ్ రూమ్‌ను బుక్ చేసుకున్న తర్వాత, ఏ కారణం వల్లయినా మీరు ఆ గదిని రద్దు చేసుకోవాలనుకుంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా రూమ్ బుకింగ్ క్యాన్సిల్ చేయవచ్చు. చెక్-ఇన్ టైమ్ కంటే 48 గంటల కంటే ముందే రూమ్ బుకింగ్ రద్దు చేసుకుంటే 10% మినహాయించుకుని మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు. రూమ్ బుకింగ్ ఛార్జ్ కింద ఆ 10% తీసుకుంటారు. 24 గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం మినహాయిస్తారు. 24 గంటల లోపు రిటైరింగ్ రూమ్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వరు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial