By: ABP Desam | Updated at : 17 Dec 2022 09:17 AM (IST)
Edited By: Arunmali
కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీవో పూర్తి వివరాలు
Kfin Technologies IPO: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు (IPO) వస్తోంది. ఈ ఇష్యూ ఈ నెల (డిసెంబర్ 2022) 19వ తేదీన ప్రారంభమై 21వ తేదీన (సోమ, మంగళ, బుధవారాలు) ముగుస్తుంది.
IPO పూర్తి వివరాలు:
ఒక్కో షేరుకు రూ. 347 నుంచి రూ. 366 వరకు ధరను ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రైస్ రేంజ్‌లో IPO కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
IPO షేర్ల కోసం లాట్స్ రూపంలో బిడ్స్ దాఖలు చేయాలి. ఒక్కో లాట్‌కు 40 షేర్లు ఉంటాయి. ఒక్కో దరఖాస్తుదారుడు గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్ వేయవచ్చు.
ప్రైస్ బ్యాండ్ లోయర్ ఎండ్ ప్రకారం ఒక్కో లాట్‌కు కనిష్ట పెట్టుబడి రూ. 13,880 (రూ. 347 x 40 షేర్లు) . ప్రైస్ బ్యాండ్ అప్పర్ ఎండ్ ప్రకారం ఒక్కో లాట్‌కు గరిష్ట పెట్టుబడి రూ. 14640 (రూ. 366 x 40 షేర్లు).
IPO ద్వారా ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 1,500 కోట్లు సమీకరించాలన్న కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్లాన్. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లో సాగుతుంది, ఫ్రెష్ షేర్ ఒక్కటి కూడా లేదు. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ Pte లిమిటెడ్, 4.09 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో (OFS) విక్రయిస్తోంది. అంటే, IPO ద్వారా సమీకరించే డబ్బు మొత్తం ప్రమోటర్ జేబులోకి వెళ్తుంది. ఫ్రెష్ ఇష్యూ కాదు కాబట్టి, కంపెనీ ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా వెళ్లదు.
IPOలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBలు) కోసం 75 శాతం షేర్లను కంపెనీ రిజర్వ్ చేసింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15 శాతానికి మించని కోటా రిజర్వ్ అయింది. ఈ కోటాలోనే హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (HNIలు) కూడా ఉంటారు. మొత్తం ఇష్యూ సైజ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 10 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ చేయగలరు.
బిజినెస్
కేఫిన్ టెక్నాలజీస్ ఒక విధంగా కొత్త కంపెనీ, 2017లో ఏర్పాటయింది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ సొల్యూషన్స్‌ను అందించే అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. రెగ్యులేటరీ రికార్డ్ కీపింగ్, బ్రోకరేజ్ లెక్కలు, IPO లావాదేవీల ప్రాసెసింగ్ వంటి సేవలు సహా అసెట్ మేనేజర్లు, కార్పొరేట్ ఇష్యూయర్స్‌కు అనేక రకాల సొల్యూషన్స్‌ను ఇది అందిస్తుంది. భారతదేశ నేషనల్ పెన్షన్ సిస్టం కోసం పని చేస్తున్న రెండు ఆపరేటింగ్ సెంట్రల్ రికార్డ్-కీపింగ్ ఏజెన్సీల్లో (CRAs) కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒకటి.
గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ. 645.56 కోట్ల ఆదాయం, రూ. 148.55 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) సెప్టెంబరు నాటికి రూ. 353.76 కోట్ల ఆదాయాన్ని, రూ. 85.34 కోట్ల నికర లాభాన్ని కేఫిన్ టెక్నాలజీస్ గడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy