By: ABP Desam | Updated at : 18 Apr 2023 10:41 AM (IST)
నిరాశపరిచిన అవలాన్ టెక్ లిస్టింగ్
Avalon Technologies IPO Listing: అవలాన్ టెక్నాలజీస్ షేర్ల లిస్టింగ్ పూర్తయింది, ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే తన పెట్టుబడిదార్లను నిరాశ పరిచింది. దీని లిస్టింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
ఇవాళ, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 431 వద్ద అవలాన్ టెక్ ప్రయాణం ప్రారంభమైంది, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 436 వద్ద జాబితా అయింది.
IPO సమయంలో, ఒక్కో షేర్‌ను రూ. 436 ధరకు అవలాన్ టెక్ ఇష్యూ చేసింది. ఈ ధర ప్రకారం.. BSEలో 1.15 శాతం డిస్కౌంట్‌తో, NSEలో ఫ్లాట్‌గా షేర్ల లిస్టింగ్ జరిగింది.
అవలాన్ టెక్ IPO ఈ నెల (ఏప్రిల్) 3-6 తేదీల మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఈ ఇష్యూ మొత్తం 2.21 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లు దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, రిటైల్ పోర్షన్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాలేదు. ఐపీవో ప్రారంభానికి ముందు, అన్ లిస్టెడ్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ. 8-10 ప్రీమియంతో చేతులు మారాయి. అయితే, స్టాక్ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో, లిస్టింగ్‌కు ముందు, అనధికార మార్కెట్ లేదా గ్రే మార్కెట్‌లో ఈ షేర్లకు డిమాండ్ తగ్గింది.
అవలాన్ టెక్ IPO వివరాలు:
పబ్లిక్ ఆఫర్ ద్వారా ప్రైమరీ మార్కెట్ నుంచి దాదాపు రూ. 865 కోట్లను ఈ కంపెనీ సేకరించింది. 2023 మార్చి 31న జరిగిన ప్రి-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 160 కోట్లు కూడగట్టడంతో ఐపీఓ పరిమాణం గతంలోని రూ. 1,025 కోట్ల నుంచి ఇప్పటి రూ. 865 కోట్లకు తగ్గింది.
ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా దాదాపు రూ. 320 కోట్లు సమీకరించింది. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదార్లు రూ. 545 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో విక్రయించారు. OFS కింద.. ప్రమోటర్లు కున్హమద్ బిచా, భాస్కర్ శ్రీనివాసన్ వరుసగా రూ. 131 కోట్లు, రూ.172 కోట్ల వరకు షేర్లను విక్రయించారు. ప్రమోటర్ గ్రూప్‌లోని మరికొందరు కూడా షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.
ఫ్రెష్ ఈక్విటీ సేల్స్ ద్వారా వచ్చే రూ. 320 కోట్లు మాత్రమే కంపెనీ ఖాతాలోకి చేరతాయి. రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తామని సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో (DRHP) ఈ కంపెనీ వెల్లడించింది.
IPOలో.. అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్ల (QIBలు) కోసం 75% షేర్లను రిజర్వ్ చేశారు. 15% షేర్లు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIలు), మిగిలిన 10% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
కంపెనీ వ్యాపారం - లాభనష్టాలు
ఎండ్-టు-ఎండ్ సర్వీస్ సొల్యూషన్స్‌ను అందించే సమగ్ర ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అవలాన్ టెక్నాలజీస్. ఈ కంపెనీకి US, భారతదేశంలో 12 తయారీ యూనిట్లు ఉన్నాయి. క్యోసాన్ ఇండియా, జోనార్ సిస్టమ్స్ ఇంక్, కాలిన్స్ ఏరోస్పేస్, ఇ-ఇన్ఫోచిప్స్ వంటి పెద్ద కంపెనీలు ఈ కంపెనీ కీలక క్లయింట్ లిస్ట్‌లో ఉన్నాయి.
కేబుల్ అసెంబ్లీ & వైర్ హార్నెస్, షీట్ మెటల్ ఫాబ్రికేషన్, మెషీనింగ్, మాగ్నెటిక్స్, ఇంజెక్షన్ మోల్డ్ ప్లాస్టిక్స్ బిజినెస్ కూడా ఈ కంపెనీ చేస్తోంది.
2022 నవంబర్‌తో ముగిసిన కాలానికి ఈ కంపెనీ రూ. 584 కోట్ల ఆదాయం సంపాదించింది. దీనిపై, పన్ను తర్వాతి లాభం (PAT) రూపంలో రూ. 34 కోట్లు మిగిలింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Tata Technologies IPO: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్లో ఉంది!
Aakash IPO: బైజూస్ ఆకాశ్ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!
Nexus IPO: కేవలం 3% లాభంతో లిస్ట్ అయిన నెక్స్స్ సెలెక్ట్ ట్రస్ట్, ఇది ఊహించినదే!
Nexus Trust: నెక్సస్ ట్రస్ట్ IPO ప్రారంభం, బిడ్ వేసే ముందు బుర్రలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు
Mankind Pharma: లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్ ఫార్మా, 20% లిస్టింగ్ గెయిన్స్
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్