IPL 2022: ఐపీఎల్ స్పెషల్ ఆఫర్! ఫ్రీగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లైవ్‌స్ట్రీమింగ్ ఇస్తున్న జియో!
IPL 2022 Live: ఐపీఎల్ సరికొత్త సీజన్ మొదలైంది. ఈ టీ20 కార్నివాల్ వేళ టెలికాం ఆపర్లేటర్లంతా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఎప్పట్లాగే రిలయన్స్ జియో స్పెషల్ ఆఫర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్యాకేజీని ఉచితంగా* అందిస్తోంది!
Reliance Jio Offering Disney Plus Hotstar Subscription Free: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త సీజన్ మొదలైంది. ఈ టీ20 కార్నివాల్ వేళ టెలికాం ఆపర్లేటర్లంతా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఎప్పట్లాగే రిలయన్స్ జియో స్పెషల్ ఆఫర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్యాకేజీని ఉచితంగా* అందిస్తోంది! ఈ ప్లాన్లతో 60 రోజుల పాటు ఐపీఎల్ వేడుకను వీక్షించొచ్చు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ డేటాను పొందొచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సీజన్ తొలి మ్యాచులో తలపడుతున్నాయి.
జియో సరికొత్త రూ.555 ప్లాన్‌తో యూజర్లు ఇప్పుడు 55 రోజుల పాటు 1GB డేటాను ప్రతిరోజూ పొందొచ్చు. దీంతో పాటు పూర్తి ఏడాది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అంతేకాకుండా రూ.499 రీఛార్జి చేసుకుంటే 28 రోజుల వరకు 2జీబీ డేటా వస్తుంది. ఏడాది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందుబాటులో ఉంటుంది. రూ.799, రూ.1066, రూ.3199 ప్లాన్లతో యూజర్లకు ప్రతి రోజూ 2జీబీ డేటా వస్తుంది. ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ దొరుకుతుంది. ధరను బట్టి వీటి వ్యాలిడిటీ మారుతుంది.
రోజుకు 2.5 జీబీ డేటా 365 రోజులు కావాలనుకుంటే యూజర్లు రూ.2,999తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతో ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇక రూ.601తో రీఛార్జి చేసుకుంటే 28 రోజులు 3జీబీ డేటా వస్తుంది. ఏడాది వరకు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. రూ.1,499 ప్లాన్‌లో ఏడాది మొత్తం రోజుకు 3 జీబీ ఇవ్వడమే కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. జియో ఫైబర్ కస్లమర్లు రూ.999 ఆపై ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే టీవీల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ను ఉచితంగా చూడొచ్చు. జియో సెటప్ బాక్సుల్లోనూ ఇది వస్తుంది.
T20 Season is here and so is the season of winning big, daily. Download MyJio App and head to Jio Cricket Play Along where exciting prizes await you. https://t.co/UAQUt31t5o#KheloCricket #JioCricket #T20Cricket #JCPA #JioEngage pic.twitter.com/uPeA2alU0B
— Reliance Jio (@reliancejio) March 25, 2022
Presenting JioPhone Next with Voice First Capabilities which lets you operate your smartphone by just speaking to it. Get your own JioPhone Next for only ₹1999* with Easy EMI Inclusive of a monthly recharge plan.
— Reliance Jio (@reliancejio) March 21, 2022
For home delivery, visit: https://t.co/ZLgf9VuPOB#JioPhoneNext pic.twitter.com/loO6ROy4Cl