By: ABP Desam | Updated at : 31 Aug 2022 06:28 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత జీడీపీ
India Q1 GDP: భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సూపర్ ఫాస్ట్ వేగం అందుకుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, కమోడిటీ ధరలు తగ్గడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగవ్వడంతో దేశ జీడీపీ భారీగా పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ రెండంకెల వృద్ధిరేటు 13.5 శాతం నమోదు చేసింది. రాయిటర్స్, ఇతర సంస్థలు అంచనా వేసిన 15.2 శాతం కన్నా కొద్దిగా తగ్గింది. అయితే చివరి త్రైమాసికంలోని 4.1% వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైంది.
ప్రైవేటు వినియోగం పెరగడం జీడీపీ వృద్ధిరేటు పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొవిడ్1-19 భయాలు తగ్గిపోవడంతో తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ జోరు పెరిగింది. అంతకు ముందు డెల్టా వేవ్‌తో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్లు అమలు చేయడం, ఆంక్షలు విధించడంతో డిమాండ్, వినియోగం తగ్గిన సంగతి తెలిసిందే.
గత ఆర్థిక ఏడాదిత తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిరేటుతో పయనించింది. అయితే కొవిడ్-19 మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ 23.8 శాతం కుంచించుకుపోవడంతో వృద్ధిరేటు తగ్గిపోయింది. లాక్‌డౌన్లతో వ్యాపారాలు మూసివేయడానికి తోడు లక్షల మందికి ఉపాధి కరవైంది. భారత్‌తో పోలిస్తే చైనా వృద్ధిరేటు మరింత కుంచించుకుపోయింది. జీరో కొవిడ్ పాలసీతో అక్కడి తయారీ కర్మాగారాలు మూతపడటమే ఇందుకు కారణం.
భారత తయారీ రంగం 4.8 శాతం, నిర్మాణ రంగం 16.8 శాతం రేటుతో వృద్ధి చెందుతున్నాయని కేంద్ర గణాంక శాఖ బుధవారం వెల్లడించింది. ప్రైవేటు వినియోగం ఏకంగా 26 శాతానికి పెరిగిందని తెలిపింది. 'స్థిర (2011-12) ధరలతో పోలిస్తే 2022-23 తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.36.85 లక్షల కోట్లకు చేరుకుంది. 2021-22లో ఇది రూ.32.46 లక్షల కోట్లు. ఇదే సమయంలోని 20.1 శాతంతో పోలిస్తే 13.5 శాతం వృద్ధిరేటు నమోదైంది' అని ప్రభుత్వం తెలిపింది. కాగా తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటును ఆర్బీఐ 16.2 శాతం, ఏడాదికి 7.2 శాతంగా అంచనా వేయడం గమనార్హం.
వ్యాక్సినేషన్ విస్తృతి, కీలక రంగాల్లో పురోగతితో భారత వృద్ధిరేటు 13 శాతంగా ఉంటుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా వేసింది. వినియోగం, సేవలు, పెట్టుబడి రంగాల్లో వృద్ధి పెరిగిందని తెలిపింది. ప్రైవేటు వినియోగం 16 శాతం, స్థూల స్థిర మూలధన ఫార్మేషన్ 14 శాతంగా అంచనా వేసింది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఎగుమతులు తగ్గుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎకానమీకి మద్దతు దొరికిందని వెల్లడించింది.
US GDP shrinks for second consecutive quarter while India's GDP growth in Q1 FY23 expected at 15%.
— Rishi Bagree (@rishibagree) August 31, 2022
While World GDP is shrinking Indian Economy is racing ahead. pic.twitter.com/0fI6fQxjOi
Ministry of Statistics and Programme Implementation released Estimates of Gross Domestic Product for the First Quarter (April-June) of 2022-23
— PIB India (@PIB_India) August 31, 2022
Read here: https://t.co/F7kgEuBF0q
Index of Eight Core Industries (Base: 2011-12=100) for July 2022
— PIB India (@PIB_India) August 31, 2022
The combined Index of Eight Core Industries increases by 4.5 per cent as compared to the Index of July 2021
Read here: https://t.co/PACNTqJLLC
Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం
Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు
Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Stocks To Watch 28 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' Adani Ports, Apollo Hosp, Zee
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
/body>