Gautam Adani News Today: భారత్‌లో అధికారులకు లంచం ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు? అదానీపై అభియోగాల్లో 2వేల కోట్ల లెక్కేంటీ?
Gautam Adani US Case: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా వివిధ రాష్ట్రాల అధికారులకు అదాని కంపెనీ లంచాలు ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు? గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఏం జరిగింది?
Gautam Adani US Bribery Case: ఆదానీ గ్రూప్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఆయన మేనల్లుడు తోపాటు ఇంకో ఏడుగురిపైన కూడా ఈ కేసు ఉంది. ఫారిన్ కరెప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్‌ని ఉల్లంఘించారని, అమెరికాలోని పెట్టుబడుదారులను మబ్యపెట్టారని, మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ల కోసం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి 3 బిలియన్ డాలర్స్ అంటే 25 వేల కోట్ల దాకా సేకరించడానికి వారిని తప్పుదోవ పట్టించేలా చేశారని ఇందులో ప్రధాన ఆరోపణ .
యూఎస్ జస్టిస్ డిపార్టమెంట్ వెబ్‌సైట్‌లోని నేరారోపణల ప్రకారం... ఆదానీతోపాటు ఏడుగురు నిందితులు 2020 నుంచి 2024 మధ్యకాలంలో ఈ నేరానికి పాల్పడ్డారని తెలుస్తోంది. భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్స్‌కుపైగా లంచాలు చెల్లించారని కేసు డైరీలో పేర్కొన్నారు. అందువల్లే లాభదాయకమైన విద్యుత్ కాంట్రాక్ట్స్‌ను పొందినట్టుకూడా చెబుతున్నారు. రాబోయే 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల పోస్ట్-టాక్స్ లాభాలు ఆర్జించవచ్చని అంచనా వేశారు.
ఈ కేసులో లంచం, అవినీతి ఆరోపణల్లో భాగంగా గౌతమ్ అదానీ జోక్యం నేరుగా ఉందని అమెరికా కోర్టు తేల్చింది. ఈ లంచం కోసం ఆయన ఇండియన్ అఫీషియల్స్‌తో పర్సనల్ మీటింగ్స్ కూడా నిర్వహించినట్లు రిపోర్ట్‌లో తెలిపారు. దీనికి సంబంధించి వివిధ సాక్ష్యాలను కూడా సేకరించారు.
Also Read: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్ అదానీ
ఇంతకీ కేసు ఏంటి? భారత్‌లో ఏం జరిగింది?
ఆదానీ గ్రూప్‌లో ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీంతో పాటు మరో కంపెనీ కలిసి 12 గిగావాట్ల అతి పెద్ద సోలార్ పవర్‌ను భారత ప్రభుత్వానికి విక్రయించడానికి కుదిరిన ఒప్పందం. దీని చుట్టే ఈ కేసు తిరుగుతుంది. అమెరికా ప్రాసిక్యూటర్స్ ప్రకారం అదానీతో పాటు ఇతర నిందితులు వాల్ స్ట్రీట్ కంపెనీ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పొందేందుకు రికార్డులు తప్పుగా చూపించారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్‌లు రుణాలు, బాండ్స్ ద్వారా ఇన్వెస్టర్స్ నుంచి 3 బిలియన్ డాలర్స్‌కుపైగా నిధులు సేకరించారు.
ఇలా ఫండ్ రైజ్ చేయాలంటే ప్రాజెక్టులు చూపించాలి. అందుకే భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చి ప్రాజెక్టు కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారని ఆరోపణలు.
ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా కోర్టుకు వేసిన ఛార్జ్ షీట్‌లో తెలిపారు. అలా మోసపూరితంగా సేకరించిన సోలార్ కాంట్రాక్టులకు అమెరికాలో సేకరించిన ఫండ్స్‌ను వాడారని అభియోగం. గ్రీన్ బాండ్ సేల్ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ 600 మిలియన్లను అమెరికాలో నిధులు సేకరించింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆరోపణలు వచ్చాయి. తమ కంపెనీ అవినీతి వ్యతిరేక విధానాలు, ఆర్థిక సమచారంపై కూడా విదేశీ పెట్టుబడిదారుల వద్ద తప్పుగా క్లెయిమ్ చేసుకున్నట్లుగా ఛార్జ్‌షీట్‌లో ఉంది.
Also Read: గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
ఈ కుంభకోణంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొంతమంది ఉన్నత అధికారుల ప్రమేయం ఉందని అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు అవసరం అని పేర్కొంది. ఈ కేసుపై అదానీ గ్రీన్ స్పందించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన నేరారోపణల కారణంగా USD-డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.
Also Read: అమెరికా కేసు ఎఫెక్ట్- అదానీ గ్రూప్ షేర్లు క్రాష్