News
News
X

Indian Unicorns: జయహో- చైనాను ఓవర్‌టేక్‌ చేసిన భారత యూనికార్న్‌లు

పెట్టుబడులు పెరిగిన ప్రతిసారీ ఆయా కంపెనీల విలువ (వాల్యుయేషన్‌) పెరుగుతుంది. ఇలా $1 బిలియన్ వాల్యుయేషన్‌కు చేరిన సంస్థను యూనికార్న్‌గా పిలుస్తారు.

FOLLOW US: 

Indian Unicorns: కొన్ని రోజుల క్రితమే, బ్రిటన్‌ దాటి ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్‌; తాజాగా, యూనికార్న్‌ కంపెనీల విషయంలోనూ చైనానూ దాటేసింది. అత్యంత వేగవంతమైన, బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందనడానికి, మన దేశం మీద విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇవి చిహ్నాలు.

ప్రస్తుత విషయంలోకి వస్తే... ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో (జనవరి - జూన్‌ కాలంలో) భారతదేశం నుంచి కొత్తగా 14 కంపెనీలు యునికార్న్‌ ఘనత సాధించగా, చైనా నుంచి 11 మాత్రమే ఆ స్థాయిని అందుకున్నాయి. అయితే, అమెరికా నుంచి ఏకంగా 138 స్టార్టప్‌లు యునికార్న్ క్లబ్‌లో చేరాయి. తద్వారా యూనికార్న్‌ ర్యాంగింగ్‌లో US ముందుంది. బ్రిటన్‌ 17 యూనికార్న్‌లను జోడించింది. హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2022 నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

యూనికార్న్‌ అంటే?
స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కాకుండా, $1 బిలియన్ ( పస్తుత రూపాయి విలువ ప్రకారం దాదాపు రూ.8 వేల కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ విలువకు చేరిన అంకుర సంస్థను (స్టార్టప్‌) యూనికార్న్‌గా పిలుస్తారు. ఈ స్టార్టప్‌ చేసే వ్యాపారం లేదా అందిస్తున్న సేవల మీద నమ్మకంతో వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అలా, వివిధ రౌండ్లలో ఈ స్టార్టప్‌లు పెట్టుబడులను సంపాదిస్తుంటాయి. పెట్టుబడులు పెరిగిన ప్రతిసారీ ఆయా కంపెనీల విలువ (వాల్యుయేషన్‌) పెరుగుతుంది. ఇలా $1 బిలియన్ వాల్యుయేషన్‌కు చేరిన సంస్థను యూనికార్న్‌గా పిలుస్తారు. 

బలమైన భవిష్యత్‌
యూనికార్న్‌ స్థాయికి చేరడం సాధారణ విషయం కాదు. అది చేసే వ్యాపారాన్ని, భవిష్యత్‌ వృద్ధిని పెట్టుబడి పెట్టే కంపెనీలు లేదా వ్యక్తులు బలంగా నమ్మాలి. అందుకే, యూనికార్న్‌ క్లబ్‌లో చేరిన సంస్థను నాణ్యమైనదిగా అంతర్జాతీయ వ్యాపార సమాజం భావిస్తుంది. యూనికార్న్‌లుగా మారిన కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లోకి వచ్చి దడదడలాడించాయి కూడా.

369 కొత్త యునికార్న్‌లు
2022 ప్రథమార్ధంలో, గ్లోబల్‌గా 369 కొత్త కంపెనీలు యునికార్న్‌ పొజిషన్‌ తీసుకున్నాయి. సగటును చూస్తే.. ఈ ఆరు నెలల్లో రోజుకు రెండు చొప్పున ఈ ఘనత సాధించాయి. వీరిలో దాదాపు మూడింట ఒక వంతు కంపెనీలు ఫిన్‌టెక్, సాస్ (SaaS), బ్లాక్‌చెయిన్‌ సెగ్మెంట్లలోనే ఉన్నాయి. 80% కంపెనీలు సర్వీసులను అందిస్తుండగా, 20% కంపెనీలు మాత్రమే వస్తు ఉత్పత్తులు చేస్తున్నాయి. ఈ మొత్తం యూనికార్న్స్‌లో... 65% కంపెనీలు తమ వస్తువులు లేదా సేవలను ఇతర బిజినెస్‌లకు అందిస్తుండగా, 35% కంపెనీలు మాత్రమే నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నాయి.

మూడో స్థానంలో భారత్‌
మొత్తం 625 యునికార్న్‌లతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉంది. సెకండ్‌ ర్యాంక్‌లో చైనా (312), థర్డ్‌ ర్యాంక్‌లో భారత్ (68) ఉన్నాయి. యూకే (48), జర్మనీ 36, ఇజ్రాయెల్‌ (24), ఫ్రాన్స్‌ (23), కెనడా (21), బ్రెజిల్‌ (17), దక్షిణ కొరియా (15) టాప్‌ -10లో ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 09 Sep 2022 10:31 AM (IST) Tags: India china 2022 Stock Market unicorns

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి