అన్వేషించండి

Indian Airlines Losses: ఎయిర్ లైన్స్ వ్యాపారం అంటేనే దివాలా - మాల్యాకే తప్పలేదు - ఎందుకిలా? మార్పు ఎలా?

Civil Aviation: ఇండియా ఎయిర్ లైన్ సంస్థ నష్టాల బారిన పడి దివాలా తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నో కంపెనీలు వచ్చాయి. మూతపడ్డాయి. తెలుగువారి కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి.

India Airlines Companies faces bankruptcy due to losses: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లలో ఒకటి. అయినా  గత మూడు దశాబ్దాల్లో దాదాపు 15కి పైగా విమానయాన సంస్థలు దివాలా తీసి మూతపడ్డాయి. ఈ రంగంలోకి ఆశలతో అడుగుపెట్టిన సంస్థలు భారీ నష్టాలు, రుణభారం,  పోటీతత్వం కారణంగా ఆకాశం నుంచి క్రాష్ ల్యాండ్ అవుతున్నాయి. 
 
మాల్యా కూడా దివాలా తీసి పరారీ                                 

1990లలో వేగంగా విస్తరించింది అనిపించిన  మోడీలుఫ్ట్ తీవ్ర పోటీ , ఆర్థిక కష్టాలతో 1996లో మూతపడింది. 2000లలో ఎయిర్ డెక్కన్, దేశంలో తొలి లో-కాస్ట్ క్యారియర్‌గా ప్రారంభమైనా, ఇంధన ధరల పెరుగుదల,  మార్కెట్ షేర్ క్షీణతతో 2008లో కింగ్‌ఫిషర్‌కు  అమ్మేసుకున్నారు.  కింగ్‌ఫిషర్ స్వయంగా 2012లో రూ.9,000 కోట్ల రుణాలతో దివాలా తీసింది, ఇక్కడ విజయ్ మాల్యా నాయకత్వంలో ఎయిర్ డెక్కన్ ఏకీకరణ తర్వాత నష్టాలు పెరిగాయి. 2010లలో పారామౌంట్ ఎయిర్‌వేస్ ,  ఎయిర్ పెగాసస్ వంటి చిన్న సంస్థలు రుణాలు , సాంకేతిక సమస్యలతో మూతపడ్డాయి. ఎయిర్ కార్నివల్ 2017లో జీతాలు చెల్లించకపోవడం , స్ట్రైకులతో ఆగిపోయింది.

జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు లేదు..తెలుస్తోందా?                  

అతిపెద్ద  ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగిన జెట్ ఎయిర్‌వేస్ 2019లో రూ.18,000 కోట్ల రుణభారంతో దివాలా ప్రక్రియలోకి జారుకుంది, ఇది 2024లో పూర్తిగా లిక్విడేషన్‌కు వెళ్లింది. తాజాగా, గోఫస్ట్  రూ.11,000 కోట్ల రుణాలతో మూతపడింది. ఈ దివాలాల వెనుక ప్రధాన కారణాలు అతి పోటీ,  చీప్ టికెట్ ధరలు, అధిక ఇంధన పన్నులు ,  కట్-త్రోట్ కాంపిటీషన్.   భారత విమానయాన రంగం అత్యంత క్యాపిటల్ ఇంటెన్సివ్, ఇక్కడ FDI  ఫారిన్ క్యారియర్స్‌కు 49% మాత్రమే ఉంది.   మరోవైపు, డాలర్ విలువ పెరగడం, లీజ్ పేమెంట్స్, మెయింటెనెన్స్ ఖర్చులు డాలర్‌లో ఉండటం నష్టాలను పెంచుతున్నాయి.

తెలుగువాళ్ల ప్రయత్నాలు ఫెయిల్                   

ట్రూజెట్ పేరుతో చిన్న విమానయానసంస్థను రామ్ చరణ్ తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు. కానీ అది మూతపడింది. అలాగే.. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త లింగమనేని ఎయిర్ కోస్తాను ప్రారంభించారు. కొన్నాళ్లు నడిచిన తర్వాత అది కూడా మూతపడింది. ఇటీవల ట్రూజెట్ ను మళ్లీ పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది కానీ తర్వాత సైలెంట్ అయ్యారు.  కింగ్‌ఫిషర్ మూతతో వేలాది ఉద్యోగాలు పోయాయి, బ్యాంకులకు భారీ నష్టాలు వచ్చాయి. జెట్ ఎయిర్‌వేస్ కేసులో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (IBC) కూడా పూర్తి పరిష్కారం ఇవ్వలేదు. COVID-19 మహమ్మారి ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసింది.  ఇక్కడ ఒక సంస్థ ఫెయిల్ అయితే మొత్తం రంగం ప్రభావితమవుతుంది. నిపుణులు ఇంధన పన్నులు తగ్గించడం, రెగ్యులేటరీ రిఫార్మ్స్ , మరిన్ని FDIలకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget