Independence Day 2025: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్స్- మొబైల్స్ నుంచి గృహపకరణాలపై భారీ తగ్గింపు
Independence Day 2025:స్వాతంత్య్ర దినోత్సవం అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఎంతో ఆందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఆనందంలో షాపింగ్‌లు కూడా చేస్తుంటారు. అందుకే ఈ కంపెనీలు ఆఫర్స్ పెడుతున్నాయి.

Independence Day 2025: భారతీయ సంప్రదాయంలో ఏ పండగైనా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ఏదైనా కొత్త వస్తువు కొంటే మంచిదని నమ్ముతుంటారు. అది దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పండగైనా కావచ్చు. లేదా ఇంట్లో వారి పుట్టిన రోజు అయినా కావచ్చు. ఆ రోజు ఏదో కొత్త వస్తువైనా, కొత్త డ్రెస్ అయినా కొనేందుకు ప్రయత్నిస్తారు. ఇది తెలిసిన కంపెనీలు పండగ రోజున ప్రత్యేక ఆఫర్స్‌తో రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. ఇప్పుడు జరుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అనేక ఆఫర్స్ ప్రకటించాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇండిపెండెన్స్ డే వేళ క్రోమా, ఫ్లిప్‌కార్ట్, ఎల్జీ, సోనీ ఇలా చాలా కంపెనీలు ఆఫర్లతో అదరగొడుతున్నాయి. మొబైల్ షోరూమ్‌ల నుంచి హోమ్ అప్లియెన్సెస్ అమ్మే షాపులు, ఇవన్నీ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే సంస్థలు అన్నీ కూడా తగ్గింపు ధరల్లో వస్తువులు అమ్మకానికి పెట్టాయి. ఆకర్షణీయమైన ఆఫర్‌లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వస్తువులపై తగ్గింపు ధరలతోపాటు ప్రత్యేక కార్డులతో కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, ఈఎంఐ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. కరెక్ట్‌గా యూజ్ చేస్కుంటే మాత్రం మీరు భారీగా నగదు మిగుల్చుకోవచ్చు.
క్రోమా ఇస్తున్న ఆఫర్ ఏంటంటే?
టాటా గ్రూప్ యాజమాన్యంలో నడుస్తున్న రిటైల్ చైన్ క్రోమా స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఆఫర్ గడువు ఆగస్టు 17తో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 560కిపైగా స్టోర్స్‌లలో ఈ ఆఫర్ రన్ అవుతోంది. ఏ స్టోర్‌లోకి వెళ్లినా సరే మీకు తగ్గిన ధరల్లో వస్తువులు లభిస్తాయి. స్మార్ట్ టీవీల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఆపిల్ ఉత్పత్తులు ఇలా చాలా వస్తువులపై ఈ సంస్థ ఆఫర్ అమలు చేస్తోంది.
క్రోమా ప్రకటించిన ఆఫర్‌లలో కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు
- నథింగ్ ఫోన్ 2a ప్లస్ ఫోన్ సాధారణంగా దాదాపు 30 వేలు ఉంది. దీన్ని క్రోమాలో 17వేల రూపాయలకే ఇస్తున్నారు. రియల్‌మి 14ప్రో లైట్ కూడా 20వేల రూపాయలకే స్తారు.
- 7వేల రూపాయల 55 ఇంచ్‌లో క్యూఎల్‌ఈడీ టీవీ కేవలం 31వేలకే ఇస్తున్నారు. 7కేజీల సెమీ ఆటోమేటిక్ వాషింగ్‌మెషిన్ 8వేలకు, 190 లీటర్ల డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ 12వేలకు అందిస్తున్నారు.
- ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్ నడుస్తోంది. హెచ్‌పీ 15 ల్యాప్ టాప్ ఎక్స్చేంజ్, క్యాష్‌బ్యాక్ డీల్‌తో 30వేలకే వస్తుంది.
ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్స్
ఐ ఫోన్16 39వేల నుంచి ప్రారంభమవుతుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 57వేలకు వస్తుంది. అంతే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నారు. 11వ జనరేషన్ ఐప్యాడ్ 30వేలు వస్తుంది. వీటితోపాటు ప్రతి వస్తువును ఈఎంఐలో కొనుక్కోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్‌డే ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రత్యేక సేల్ పెట్టింది. ఇది ఆగస్టు 13న ప్రారంభమవుతుంది. ఆగస్టు 17వరకు ఈ సేల్ ఉంటుంది. ఐదు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ సేల్ 2025 అనే పేరుతో నిర్వహించే ఈ సేల్‌లో చాలా వస్తువులపై తగ్గింపు ఆఫర్ ఇస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే పది శాతం డిస్కౌంట్ ఉంటుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉంటాయి. ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌తోపాటు గృహోపకరణాలపై డిస్కౌంట్ ప్రకటించింది.
ఎల్‌జీ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా స్వాతంత్ర్య దినోత్సవం 2025 సందర్బంగా "ది గ్రాండ్ 15 ఫెస్ట్" పేరుతో డౌస్కౌంట్ మేళా ప్రారంభించింది.ఈ ఆఫర్ ఆగస్టు 20 నుంచి ఎల్‌జీ రిటైల్ అవుట్‌లెట్‌లు, డీలర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమల్లోకి రానున్నాయి. అందరూ ఆఫర్‌లు క్లోజ్ చేస్తున్నప్పుడు ఎల్జీ ఆఫర్‌లు ప్రారంభిస్తోంది.
ఎల్జీ సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై 26% వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. ఇది గరిష్టంగా 50 వేల వరకు అప్లై అవుతుంది. మీరు కేవలం 15 రూపాయలు డౌన్‌పేమెంట్ చేసి మిగతా అమౌంట్‌ను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. 900 వదల నుంచి మీరు ఈఎంఐ చెల్లించుకోవచ్చు. వీటితోపాటు మీకు ఉచితంగా మరికొన్ని ఆఫర్‌లు ఇస్తోంది. ఎంపిక చేసిన వాటర్ ప్యూరిఫైయర్‌లై ఏడాది నిర్వహణ ఉచితంగా చేయనుంది. ఎంపిక చేసిన సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌లు కొంటే 14వేల లేదా 12వేల ఉచిత మినీ రిఫ్రిజిరేటర్ ఉచితంగా ఇస్తుంది. ఎంపిక చేసిన మైక్రోవేవ్ ఓవెన్‌లు కొన్నవాళ్లకు ఉచిత గ్లాస్ బౌల్ కిట్ ఇస్తారు. ఎంపిక చేసిన 4K టీవీ కొన్న వాళ్లకు LG సౌండ్‌బార్‌లపై 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన LG OLED టీవీలపై మూడేళ్ల వారంటీ ఇస్తున్నారు.
సోనీ ఇండియా ఆఫర్
సోనీ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టెలివిజన్‌లు, కెమెరాలు, పర్సనల్ ఆడియో, హోమ్ ఆడియో సిస్టమ్‌లు సహా అనేక రకాల ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్‌లు ప్రకటించింది. ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో స్టాక్‌లు ఉన్నంతవరకు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. ఎంపిక చేసిన BRAVIA టెలివిజన్‌లపై 25వేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతోపాటు ఒక నెల ఈఎంఐ కూడా కంపెనీయే చెల్లిస్తున్నారు. మూడేళ్ల వారంటీ ఉంటుంది. 43 ఇంచ్‌ల కంటే పెద్ద టీవీ కొంటే కాంబో ఆఫర్ కింద సౌండ్‌బార్‌లపై 20 వేలు తగ్గింపు ఇస్తారు.
హెడ్‌ఫోన్‌లు, ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై ఆగస్టు 17 వరకు ఆఫర్ ఉంటుంది. WH-1000XM5 వైర్‌లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌లు 29వేలకు ఇస్తున్నారు. దీనికి అదనంగా వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్ ఉంటుంది. Sony Alpha కమెరా మోడళ్లపై 99వేల రూపాయల వరకు ఆఫర్ నడుస్తోంది.





















