By: ABP Desam | Updated at : 28 Dec 2022 10:11 AM (IST)
Edited By: Arunmali
ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కి లాస్ట్ ఛాన్స్
Income Tax Return: 2021-22 ఆర్థిక సంవత్సరం (FY 2021-22) లేదా 2022-23 మదింపు సంవత్సరానికి (AY 2022-23) మీరు ఇంకా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదా, తుది గడువు ముంచుకొస్తోంది, తొందరపడండి అంటూ ఆదాయ పన్ను విభాగం మరోమారు హెచ్చరించింది. ఇవాళే రిటర్న్ ఫైల్ చేయమని సూచించింది.
ఆదాయపు పన్ను చట్టం నిబంధన ప్రకారం, ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్‌ను సాధారణ గడువులోగా దాఖలు చేయలేకపోతే, ఆలస్య రుసుముతో కలిపి ఆ తర్వాతి గడువు తేదీలోగా ITR ఫైల్ చేయవచ్చు. 2022 జులై 31వ తేదీని సాధారణ గడువుగా ఆదాయ పన్ను విభాగం గతంలో నిర్ణయించింది.
2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించి, ఏ కారణం వల్లనైనా 2022 జులై 31వ తేదీ లోపు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించని వాళ్లకు ఐటీ విభాగం మరో అవకాశం ఇచ్చింది. 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి జరిమానాతో కలిపి ITR ఫైల్ చేసేందుకు వీలు కల్పించింది. దీనికి తుది గడువు 2022 డిసెంబర్ 31, శనివారం (Last Date for ITR Filing).
సెక్షన్ 139(4) ప్రకారం..
ఆదాయపు పన్ను చట్టం- 1961 సెక్షన్ 139(4) కింద ఆలస్య రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలు చేసే ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. దీనికి సెక్షన్ 234(F) ప్రకారం నిర్దిష్ట ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షలు దాటితే 5 వేల రూపాయల ఆలస్య రుసుముతో రిటర్న్ ఫైల్ చేయాలి. పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ పన్ను బకాయి ఉంటే, దానిని వడ్డీతో కలిపి చెల్లించాలి. పన్ను బకాయిలు ఉన్న వారు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు ప్రతి నెలా ఒక శాతం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
అదే విధంగా, రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (Revised Income Tax Return) దాఖలు చేయడానికి కూడా 2022 డిసెంబర్ 31ని చివరి తేదీగా ఖరారు చేశారు. ఎవరైనా ITR ఫైల్ చేసినప్పుడు ఏదైనా తప్పు దొర్లితే, సవరించిన ITR ఫైల్ చేయడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. ఇది కూడా 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించింది.
సెక్షన్ 139(5) ప్రకారం..
ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 139(5) కింద రివైజ్డ్ ITR దాఖలు చేయాలి. ఇక్కడ కూడా ఫైలింగ్ ప్రక్రియ మారదు. కాకపోతే, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు రివైజ్డ్ ITRను ఫైల్ చేస్తున్నప్పుడు, సెక్షన్ 139(5)ని ఎంచుకున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ITR నంబర్‌ను కూడా భద్రపరుచుకోవాలి.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత, వెరిఫికేషన్ వ్యవధిని గతంలోని 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. అంటే, 30 రోజులలోపు ITR వెరిఫికేషన్ చేయకపోతే, మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లదు. CBDT జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్ట్ 1, 2022న లేదా ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారు 30 రోజుల్లోపు రిటర్న్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి 120 రోజుల్లో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోద ముద్ర- ఈసారి మూడు లక్షల కోట్లతో పద్దు!
Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త
Petrol-Diesel Price 31 January 2023: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్ రేట్లు, ఏపీలో మాత్రం స్థిరం
Gold-Silver Price 31 January 2023: ₹58k వైపు పసిడి పరుగులు, తెలీకుండానే చల్లగా పెరుగుతోంది
L&T Q3 Results: ఎల్టీ అదుర్స్! మాంద్యం పరిస్థితుల్లో లాభం 24% జంప్!
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్