అన్వేషించండి

Whatsapp Schedule Message: వాట్సాప్‌లో సందేశాలను షెడ్యూలు చేయాలా? ఇదిగో దారి..!

కొద్దిమందికి తమ ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి సంభాషణలు షెడ్యూలు చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి వాట్సాప్‌లో షెడ్యూలింగ్‌ ఫీచర్‌ ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది.

వినియోగదారులకు మరింత మెరుగైన మెసేంజింగ్‌ అనుభవం అందించేందుకు వాట్సాప్‌ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటుంది! కానీ కస్టమర్లు ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్న ఫీచర్‌ను మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి తేలేదు. అదే సంభాషణాలను షెడ్యూలు చేసుకోనే ఫీచర్‌! 

ఎక్కువగా బర్త్‌డేలు, పెళ్లిరోజులను చాలామంది మర్చిపోతుంటారు! కొద్దిమందికి తమ ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి సంభాషణలు షెడ్యూలు చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి వాట్సాప్‌లో షెడ్యూలింగ్‌ ఫీచర్‌ ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో లేనప్పటికి మరో దారిలో సందేశాలను షెడ్యూలు చేయొచ్చు.

వాట్సాప్‌లో సందేశాలను షెడ్యూలు చేసేందుకు ఒక థర్డ్‌ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు SKEDit యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్‌కు ఇలాంటి అవకాశం లేదు. కానీ అందుకు మరో దారి ఉంది!!

ఆండ్రాయిడ్‌లో  ఇలా..!
వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాలోనే ప్రస్తుతం 'యూజింగ్‌ అవే మెసేజెస్‌' ఫీచర్‌ ఉంది. దీని ద్వారా కావాల్సిన సమయంలో సందేశాలను షెడ్యూలు చేసుకోవచ్చు. ఇందుకోసం

మొదట వాట్సాప్‌ ఓపెన్‌ చేసి 'మోర్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
బిజినెస్‌ టూల్స్‌లో అవే మెసేజెస్‌ను ఎంచుకోవాలి.
సెండ్‌ అవే మెసేజ్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఆపై సందేశంపై నొక్కి కస్టమైజ్‌ చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఓకేపై క్లిక్‌ చేసి షెడ్యూలు చేసుకోవాలి. ఆల్వేస్‌, కస్టమ్‌ షెడ్యూలు, వ్యాపార వేళలు ముగిసిన తర్వాత షెడ్యూలు చేసుకోవచ్చు.
అందరికీ, అడ్రస్‌ బుక్‌లోని లేని అందరికీ, కొందరిని మినహాయించి, కేవలం కొందరికి.. ఇలా ఎంచుకోవచ్చు. 
ఆ తర్వాత సేవ్‌ చేస్తే మీరనుకున్న సమయానికి వాటిని పంపించొచ్చు.

ఐఓఎస్‌లో ఇలా..!
ఐఓఎస్‌ యూజర్లకు థర్డ్‌పార్టీ యాప్‌ అవసరం లేదు. అయితే సిరి షార్ట్‌కట్స్‌ యాప్‌ను ఉపయోగించుకుంటే చాలు! దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఓపెన్‌ చేసుకోవాలి. ఆటోమేషన్ ట్యాబ్‌కు వెళ్లాలి.

ప్లస్‌ సింబల్‌ను ఉపయోగించుకొని పర్సనల్‌ ఆటోమేషన్‌పై ట్యాప్‌ చేయాలి.
ఆటోమేషన్‌ ఎప్పుడు రన్‌ చేయాలో ఆ సమయాన్ని ఎంచుకోవాలి.
యాడ్‌ యాక్షన్‌పై ట్యాప్‌ చేసి సెర్చ్‌బార్‌లో టైప్‌ చేయాలి.
ఆ తర్వాత టెక్స్ట్‌ ఏరియాలో ప్లస్‌ ఐకాన్‌పై ట్యాప్‌ చేసి మీ సందేశం షెడ్యూలు చేయాలి.
రిసిపెంట్‌ను ఎంచుకొని నెక్స్ట్‌పై క్లిక్‌ చేస్తే చాలు. షెడ్యూలు అయిపోయినట్టే.

Also Read: PM Modi on Bank Deposit: నష్టాల్లోని బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టాలు చూడలేకే రూ.5 లక్షల బీమా తెచ్చాం: మోదీ

Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!

Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్‌ ధరల పెంపు?

Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?

Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా ఉన్న వెండి, నేటి తాజా ధరలు

Also Read: Petrol-Diesel Price, 13 December: పెరుగుతున్న ముడి చమురు ధరలు.. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Embed widget