HDFC Bank Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్! రూ.10,342 కోట్ల లాభం ఆర్జించిన హెచ్‌డీఎఫ్‌సీ
Q3FY22 హెచ్ డీఎఫ్సీ నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.18,444 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం మార్జిన్ 4.1 శాతంగా ఉంది. ఆరోగ్యకరమైన రుణాల వద్ధిరేటు 16.4 శాతంగా ఉంది.
HDFC Bank Q3 profit: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదరగొట్టింది! 2021, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,342 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన మొండి బకాయిలు తగ్గించుకోవడమే కాకుండా నికర లాభాన్ని 18 శాతం పెంచుకొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.8,758 కోట్లుగా ఉండటం గమనార్హం.
Q3FY22లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.18,444 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం మార్జిన్ 4.1 శాతంగా ఉంది. ఆరోగ్యకరమైన రుణాల వద్ధిరేటు 16.4 శాతంగా ఉంది. మూడో త్రైమాసికంలో లాభం 17 శాతం, నికర వడ్డీ ఆదాయం 4.3 శాతం పెరిగాయి. రిటైల్ రుణాల వృద్ధిరేటు వార్షిక ప్రాతిపదికన 13.5 శాతం, కార్పొరేట్ రుణాల వృద్ధిరేటు 7.5 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.
వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ల వృద్ధిరేటు 13.8 శాతంగా ఉంది. మొత్తం డిపాజిట్లు రూ.14,46 లక్షల కోట్లు ఉన్నాయి. కాసా డిపాజిట్లు 24.6 శాతం పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలోని 46.8 శాతంతో పోలిస్తే డిసెంబర్లో కాసా రేషియో 43 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో అత్యవసర నిధి 12.3 శాతం తగ్గి రూ.2,994 కోట్లుగా ఉంది.
Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!