HDFC HDFC Bank Merger: హెచ్‌డీఎఫ్‌సీలో భారీ విలీనం - స్టాక్ మార్కెట్‌లో దూసుకెళ్తోన్న HDFC షేర్లు, వారికి పండగే
HDFC Merger With HDFC Bank Limited: తమ సంస్థకే చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్టిమెంట్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్ లిమిటెడ్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం అయ్యాయి.
HDFC HDFC Bank Merger: అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ సంస్థకే చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్టిమెంట్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్ లిమిటెడ్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం అయ్యాయి. ఈ మేరకు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విలీనంతో హౌసింగ్ ఫైనాన్స్ మరో స్థాయికి చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్‌డీఎఫ్‌సీలో అతిపెద్ద విలీనం..
బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విలీనం హెచ్‌డీఎఫ్‌సీలో జరిగింది. తాజా విలీనంతో బ్యాంకులో 41 శాతం వాటాలను హెచ్‌డీఎఫ్‌సీ పొందుతుంది. మోర్టగేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కావడంతో క్యాపిటలైజేషన్ విలువ రూ.12.8 లక్షల కోట్లకు ఎగబాకింది. తద్వరా దేశంలో అతిపెద్ద మూడో సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ అవతరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేషన్ 42 శాతం షేర్లను కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ 25 శాతం షేర్ల వాటా ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి హౌసింగ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వాటాదారులకు లభిస్తాయి. దేశంలోనే అతిపెద్ద విలీనం తర్వాత సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీకి 41శాతం వాటా దక్కుతుంది. ఈ వీలినంతో స్టాక్ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ పరుగులు పెడుతున్నాయి. ఇప్పటివరకూ ఆరున్నర శాతం పైగా లాభంతో సాగుతున్నాయి. తాజా విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పబ్లిక్ హోల్డర్స్ 100శాతం భాగం కానున్నారని తెలుస్తోంది.
ఎప్పటివరకూ పూర్తవుతుంది..
తాజాగా చేసిన ప్రతిపాదన నిర్ణయం 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసానికి పూర్తి కానుంది. ఆస్తుల పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ. బ్యాంకు ఆస్తులు రూ.19.38 లక్షల కోట్లు. దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఆస్తులు రూ.5.26 లక్షల కోట్లు ఉన్నాయి. దీని మార్కెట్ క్యాప్ రూ.4.44 లక్షల కోట్లు ఉండొచ్చునని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కసారిగా 13.57 శాతం లాభాలతో రూ.2,783.60కి పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9.74 శాతంతో రూ.1,654.20కి చేరింది.
Also Read: Gold-Silver Price: బంగారం కొనేవారికి నేడు కాస్త ఊరట! స్థిరంగా పసిడి ధర, వెండి కూడా అంతే