By: ABP Desam | Updated at : 30 Mar 2022 07:57 AM (IST)
ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్
Provident Fund E-nomination: కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. కానీ ఇటీవల ఉద్యోగంలో చేరిన వారితో పాటు కొన్నేళ్ల కిందట ఈపీఎఫ్ ఖాతా ఓపెయిన్ అయిన వారు తమకు అంత అవగాహన లేకపోవడంతో నామినీని వివరాలు అప్‌లోడ్ చేయలేదు. కానీ మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. ఈ నామినేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.
నామినేషన్ చేయకపోతే నష్టాలేంటి..
ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీని నిర్ణీత గడువులోగా యాడ్ చేయకపోతే రిటైర్మెంట్, పెన్షన్, ప్రమాద భీమా లాంటి ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను పొందలేరు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా ఖాతాకు నామినీని యాడ్ చేసుకోవాలని లేకపోతే అవసరమైన, క్లిష్ట పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతా ప్రయోజనాలు దక్కవని ఈపీఎఫ్ ఖాతాదారులను హెచ్చరించింది ఈపీఎఫ్ఓ. ఇ-నామినేషన్‌ను దాఖలు చేసుకున్న సబ్‌స్క్రైబర్స్‌కు ఏదైనా ఆపద సంభవించినప్పుడు వారి కుటుంబసభ్యులకు ప్రయోజనాలు అందుతాయని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈడీఎల్ఐ రూ.7 లక్షల వరకు బీమా మరియు పెన్షన్ లాంటి ప్రయోజనాలను పొందాలంటే ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోసుకోంది.
ఆన్‌లైన్‌లో EPF నామినేషన్ చేసుకునే విధానం ఇది: (how to file EPF nomination online)
- ఈపీఎఫ్ ఖాతాదారులు అధికారిక EPFO వెబ్‌సైట్‌కు వెళ్లాలి లేదా epfindia.gov.inలో క్లిక్ చేయాలి.
- హోం పేజీలో కనిపించిన ఆప్షన్లలో ‘ Service’ 'సేవ'పై క్లిక్ చేయండి
- దీని తర్వాత ఉద్యోగుల కోసం అని సూచించే ‘For Employees’ ఆప్షన్ ఎంచుకోండి
- ‘మెంబర్ UAN/ ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTP) (Member UAN/ Online Service (OCS/OTP)పై క్లిక్ చేయండి
- మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
- ‘Manage Tab’ కింద ‘E-nomination’ మీ క్లిక్ చేయాలి
- ‘Provide Details’ కనిపిస్తే మీ వివరాలను నమోదు చేయండి. తరువాత 'సేవ్' ఆప్షన్ పై క్లిక్ చేయండి
- కుటుంబ సభ్యుల వివరాల(family declaration)ను అప్‌డేట్ చేయడానికి ‘Yes’ ఎంచుకోవాలి
- కుటుంబ సభ్యుల వివరాలు అప్‌డేట్ చేయడానిక ‘Add Family Details’పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేయాలి. ఒకరి కంటే ఎక్కువ నామినీలను యాడ్ చేసుకోవచ్చు.
- ‘Nomination Details’పై క్లిక్ చేసి ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వారి షేర్ ఎంతో నమోదు చేసి సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పై క్లిక్ చేయాలి
- ‘E-sign’ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ ఆధార్ నంబర్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయితే ఈపీఎఫ్ ఈ నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లే. ఈపీఎఫ్ ఖాతాదారుడు తమ కంపెనీకి గానీ గతంలో పనిచేసిన ఆఫీసులో గానీ ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు. అయినా మీకు ఏమైనా సమస్య తలెత్తితే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మరోసారి ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ - 2 రోజుల్లో E-నామినేషన్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ కోల్పోతారు
Also Read: EPF Interest Rate: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?
UAN Activation Deadline Extended Date: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు
Gold-Silver Prices Today 04 Dec: స్థిరంగా బంగారం, వెండి మెరుపులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త ధరలు ఇవీ
Income Tax: పన్ను ఆదా చేయాలంటే ఈ నెలాఖరులోగా సీరియస్‌గా ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఇవి
Tax On Salaries In India: ఐఏఎస్, ఐపీఎస్‌లు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా, రూల్స్ అలా ఉన్నాయా?
Common Mistakes: ఈ పొరపాట్ల వల్ల స్టాక్ మార్కెట్లో 70 శాతం మంది డబ్బు గల్లంతు - ఆ తప్పులు మీరు చేయొద్దు!
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!