అన్వేషించండి

LPG Price Cut: వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ - సెప్టెంబర్‌లో మీరు గుడ్‌న్యూస్‌ వినొచ్చు!

LPG Cylinder Rate Cut: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు గణనీయంగా తగ్గాయి కాబట్టి, మన దేశంలో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయన్న వార్తలు జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి.

LPG Gas Cylinder Price May Fall: సెప్టెంబర్‌లో నెల మీకు తీపి కబురు చెప్పడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ మొదటి రోజున (01 September 2024), దేశంలో సామాన్య ప్రజలందరూ గుడ్‌న్యూస్ వినే ఛాన్స్ ఉంది. సామాన్యులకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెస్తుందన్న వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సెప్టెంబర్‌ ఒకటో తేదీన, ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతి ఇవ్వొచ్చు. గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌  ‍‌(Domestic LPG Cylinder)  & వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌ (Commercial LPG Cylinder) ధరలను సెంట్రల్‌ గవర్నమెంట్‌ తగ్గించవచ్చు. 

గ్యాస్‌ సిలిండర్‌ రేటు ఎంత తగ్గొచ్చు?
సెప్టెంబర్ మొదటి రోజున, దేశంలోని కోట్లాది మంది వినియోగదార్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం ఇచ్చేలా, 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రేటును 50 రూపాయలు తగ్గించొచ్చు. వాణిజ్య సిలిండర్‌ ధర కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ రేటు 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు తగ్గనున్నట్లు నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ చేసింది.

LPG సిలిండర్ ధర 50 రూపాయలు తగ్గితే, మీరు దానిని 760 రూపాయలకే కొనుగోలు చేయొచ్చు. సబ్సిడీ సిలిండర్‌ను మీరు 460 రూపాయలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు. పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana -  PMUY) కింద ఒక్కో వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇప్పటికే  రూ. 300 సబ్సిడీ లభిస్తోంది. ఏజెన్సీ నుంచి సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు పూర్తి ధర చెల్లించాలి, కొన్ని రోజుల తర్వాత రూ. 300 సబ్సిడీ డబ్బు లబ్ధిదారు బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. దేశంలో కోట్ల మంది ప్రజలు ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఆగస్టు ప్రారంభంలో పెరిగిన రేటు
ఆగస్టు ప్రారంభం (01 August 2024) నుంచి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధర 8 నుంచి 9 రూపాయల వరకు పెరిగింది. దీనికి ముందు, కమర్షియల్‌ సిలిండర్ల రేటు వరుసగా నాలుగు నెలల పాటు తగ్గింది. అయితే, గత కొన్ని నెలలుగా గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. 

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ‍‌(Domestic Gas Cylinder Price In Hyderabad) సుమారు రూ. 855 ధర పలుకుతోంది. విజయవాడ ‍‌(Domestic Gas Cylinder Price In Vijayawada) సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధరకు సిలిండర్‌ అందుబాటులో ఉంది.

పెట్రోల్ & డీజిల్ కూడా చౌకగా మారొచ్చు!
భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ & డీజిల్ ధరలను తగ్గిస్తూ సెప్టెంబర్‌ 01న నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం, దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలపైనే ఉండగా, లీటర్‌ డీజిల్ రేటు 90 రూపాయలు దాటింది. సెప్టెంబర్‌ నుంచి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు తగ్గించే ఛాన్స్‌ ఉంది. 

అయితే, వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల తగ్గింపు విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, సాధారణ ప్రజలు చాలా ఉపశమనం పొందుతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం వల్ల గ్యాస్‌ & పెట్రో రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: స్పైస్‌జెట్‌ ఉద్యోగులకు 3 నెలలు జీతం కట్‌, బలవంతంగా సెలవులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget