News
News
X

Gold-Silver Price 9 September 2022: తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగిన పసిడి - వెండికి గిరాకీ మామూలుగా లేదు!

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 59,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

FOLLOW US: 

Gold-Silver Price 9 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (గురువారం) పోలిస్తే నేడు (శుక్రవారం) పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ₹ 250, స్వచ్ఛమైన పసిడి ₹ 270 పెరిగింది. కిలో వెండి ధర ₹ 1,400 పెరిగింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 46,650 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 50,890 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 59,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు ₹ 46,650 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,890 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 59,500 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 47,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,600 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,890 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,040 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,950 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,950 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,680 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,930 గా ఉంది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 250 తగ్గి ₹ 21,650 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 09 Sep 2022 12:58 AM (IST) Tags: Gold Price Silver Price hyderabad gold silver price

సంబంధిత కథనాలు

Titan Company Shares: పండుగ సందడంతా టైటన్‌దే, ₹2,800 టచ్‌ చేసే ఛాన్స్‌!

Titan Company Shares: పండుగ సందడంతా టైటన్‌దే, ₹2,800 టచ్‌ చేసే ఛాన్స్‌!

CWD Shares: ధనలక్ష్మికి జిరాక్స్‌ లాంటి స్టాక్‌ ఇది, ఏడాదిలో ఏకంగా 1100% పెరిగింది!

CWD Shares: ధనలక్ష్మికి జిరాక్స్‌ లాంటి స్టాక్‌ ఇది, ఏడాదిలో ఏకంగా 1100% పెరిగింది!

Stock Market Opening: తగిలిన రూపాయి సెగ - పడిపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Opening: తగిలిన రూపాయి సెగ - పడిపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ!

MSCI India Index: ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ మారుతోంది, బీ కేర్‌ఫుల్‌ బ్రదర్‌

MSCI India Index: ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ మారుతోంది, బీ కేర్‌ఫుల్‌ బ్రదర్‌

Sebi Brickwork Ratings: చేసిన నిర్వాకం చాలు, దుకాణం సర్దేయండంటూ డెడ్లీ ఆర్డర్‌

Sebi Brickwork Ratings: చేసిన నిర్వాకం చాలు, దుకాణం సర్దేయండంటూ డెడ్లీ ఆర్డర్‌

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!