By: ABP Desam | Updated at : 09 Jan 2022 06:20 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా రూ.0.10 పైసలు పెరిగి.. కిలోకు రూ.100 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధర మాత్రం సరాసరిన రూ.9 పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,920గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,000గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.20 తగ్గి.. రూ.22,291 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!
Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్! క్రిప్టోలన్నీ నేల చూపులే!
Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ
Top Loser Today August 17, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 17, 2022 : స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
RBI on Payment Systems: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు