By: ABP Desam | Updated at : 06 Jan 2022 06:47 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన ధర నేడు గ్రాముకు రూ.25 మేర పెరిగింది. వెండి ధర నేడు గ్రాముకు రూ.0.40 పైసలు పెరిగి.. కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,250 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,250గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలో అతి స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,080 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,080 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.14 తగ్గి.. రూ.22,880 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్బౌండ్లో కదలాడిన సూచీలు చివరికి..!
Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్ @ రూ.24.20 లక్షలు
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
IPL 2022: కోల్‌కతాలో వర్షం! ఆట రద్దైతే GT vs RRలో విజేతను ఎలా నిర్ణయిస్తారు?
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన