Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ నగరంలో రేట్లు ఇవీ..

ముందు రోజు తులానికి ఏకంగా రూ.150 తగ్గిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా కొనసాగుతోంది.

FOLLOW US: 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ముందు రోజు తులానికి ఏకంగా రూ.150 తగ్గిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు నే స్థిరంగానే కొనసాగుతున్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,330గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 గా ఉంది.

ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.36  పెరిగి.. రూ.24,350 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 31 Jan 2022 06:32 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 4 July: నేడు ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు! మిగతా చోట్ల ఇలా!

Petrol-Diesel Price, 4 July: నేడు ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు! మిగతా చోట్ల ఇలా!

Gold-Silver Price: బంగారం కొనాలని చూస్తున్నారా? నేటి పసిడి, వెండి ధరలు తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొనాలని చూస్తున్నారా? నేటి పసిడి, వెండి ధరలు తెలుసుకోండి

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Petrol-Diesel Price, 3 July: నేడు ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు షాక్! మిగతా చోట్ల సాధారణమే!

Petrol-Diesel Price, 3 July: నేడు ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు షాక్! మిగతా చోట్ల సాధారణమే!

Gold-Silver Price: నేడు పసిడి ధర షాక్! ఏకంగా రూ.150 పెరుగుదల, వెండి మాత్రం భారీ ఊరట

Gold-Silver Price: నేడు పసిడి ధర షాక్! ఏకంగా రూ.150 పెరుగుదల, వెండి మాత్రం భారీ ఊరట

టాప్ స్టోరీస్

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు