అన్వేషించండి

Gold-Silver Price: మళ్లీ భగ్గుమన్న బంగారం! ఊహించని రీతిలో పెరుగుదల, వెండి కూడా అంతే

Hyderabad Gold Rate: ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,040 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నేడు విపరీతంగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో కొద్ది రోజులుగా బంగారం ధరల్లో భారీ ఎత్తున హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేడు గ్రాముకు ఏకంగా రూ.100 చొప్పున పెరిగింది. వెండి ధర కూడా గ్రాముకు రూ.2.10 పైసలు పెరిగి కిలోకు రూ.2100 మార్పు కనిపించింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,040 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.72,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 వేలుగా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధరల అదే స్థాయిలో పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,040గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.1 పెరిగి.. రూ.25,560 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Embed widget