News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold-Silver Price 29 July 2023: తగ్గిన పసిడి కాంతి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price Today 29 July 2023: యూఎస్‌ డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు కిందిగి దిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,961 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 350, స్వచ్ఛమైన పసిడి ₹ 380 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ఏకంగా ₹ 2,000 పతనమైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 55,100 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 60,110 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 79,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,550 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,250 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 730 తగ్గి ₹ 24,790 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 29 Jul 2023 06:06 AM (IST) Tags: Hyderabad Gold Price Silver Price Vijayawada Today's rate

ఇవి కూడా చూడండి

MSSC vs SSY: ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన - ఏది బెటర్‌ ఆప్షన్‌?

MSSC vs SSY: ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన - ఏది బెటర్‌ ఆప్షన్‌?

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం