Gold-Silver Price: పసిడి ప్రియులకు గూడ్‌న్యూస్! ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర, ఆ బాటలోనే వెండి కూడా..
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గింది. వెండి ధర కూడా కేజీపై రూ.200 తగ్గింది
భారత్‌లో బంగారం ధర నిన్నటి కన్నా ఈ రోజు మరింత తగ్గింది. శుక్రవారం సెప్టెంబరు 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారత మార్కెట్‌లో రూ.45,300 గా ఉండగా..శనివారం ఆ ధర 43,570 కి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర బంగారం ధర 47,530 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4360 లు ఉండగా రూ. 40తగ్గి ఈరోజు రూ. 4,320లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 43600 ఉండగా రూ. 400లు తగ్గి.. ఈ రోజు రూ. 43,200లు గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర శుక్రవారం రూ. 4,756లు ఉండగా శనివారం రూ.43 తగ్గి ఈరోజు 4,713లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ. 47,560 లు ఉండగా..శనివారం రూ. 430 మేర తగ్గి నేడు 47,130 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.శనివారం రోజున వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కిలో వెండి ధర రూ.64,900కు పడిపోయింది. భారత మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.43,570 ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,530 ఉంది .
Also Read: ఈ రోజు మేషం, వృషభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి..ఆ రాశులవారికి ఒత్తిడి దూరమవుతుంది
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర.. ముంబైలో రూ. 45,240, ఢిల్లీలో రూ. 45,350, బెంగళూరులో రూ. 43,200, చెన్నైలో రూ. 43,570, కోల్‌కత్తాలో రూ. 45,900 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర.. ముంబైలో రూ. 46,240, ఢిల్లీలో రూ. 49,480, బెంగళూరులో రూ. 47,130, చెన్నైలో రూ. 47,870, కోల్‌కత్తాలో రూ. 48,600 గా ఉంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
వెండి ధరలు
వెండి ధర ఢిల్లీలో రూ. 60,600, చెన్నైలో రూ. 64,900, బెంగళూరులో రూ. 60,600, ముంబైలో రూ. 60,600, కోల్‌కత్తాలో రూ. 60,600 గా ఉంది
హైదరాబాద్‌లో వెండి ధర నిన్నటితో పోల్చితే తగ్గింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గింది. హైదరాబాద్ లో శనివారానికి వెండి ధర 1 గ్రాము రూ. 64.90 గా ఉంది. 8 గ్రాములు రూ. 519.20, 10 గ్రాముల ధర రూ. 649 ఉంది. 100 గ్రాములు ధర రూ. 6,490 ఉండగా... కేజీ వెండి ధర... రూ.64,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది..