Gold-Silver Price: బంగారం భగభగ, ఈ రేట్లతో కొనలేం! ఒకేసారి 1,200 పైకి, యుద్ధ ప్రభావమే..
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.72,700 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి భారీగా ఎగబాకింది. గ్రాముకు ఏకంగా రూ.125 చొప్పున ఎగబాకిపోయింది. వెండి కూడా అదే దారిలో గ్రాముకు రూ.2.70 పెరిగి కిలోకు రూ.2,700 పెరిగిపోయింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.72,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700 వేలుగా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధరల్లో కూడా నేడు విపరీతంగా పెరుగుదల కనిపించింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.49,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,010గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరపై మాత్రం ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం లేదు. ప్లాటినం ధర సాధారణ రీతిలోనే మార్పు కనిపించింది. నేడు హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.11 తగ్గి.. రూ.25,900 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
తీవ్రంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.