Gold Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి పయనం.. బులియన్ మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఇవే..
భారత మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం నాడు (ఆగస్టు 24న) స్వల్పంగా పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 24న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
భారత మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం నాడు (ఆగస్టు 24న) స్వల్పంగా పుంజుకుంది. నేడు బంగారం ధర గ్రాముకు రూ.11 మేర పెరిగింది. ఒక తులం (10 గ్రాములపై) రూ.110 మేర వ్యత్యాసం కనిపించింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,400 కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.50,62గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర రూ.300 మేర పెరిగింది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరగగా.. వెండి ధర సైతం పసిడి బాటలోనే పయనించింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. న్యూఢిల్లీలో ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ.40 మేర పెరిగింది. నేడు కిలో వెండి ధర రూ.66,700 పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 24న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు...
తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.11 చొప్పున పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,270 అయింది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,250 కి చేరింది. ఇక స్వచ్ఛమైన వెండిపై రూ.40 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ వెండి ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.
నేడు విజయవాడలో 22 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర పెరగడంతో ధర ఆగస్టు 24న రూ.44,250 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,270గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,700 అయింది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 24న ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610 కి తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,660గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 అయింది.
Also Read: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?
నిలకడగా ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే ప్లాటినం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. గ్రాము తాజా ధర రూ.2,367గా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,670 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: RBI Gold Scheme: ఇంట్లో ఖాళీగా బంగారం ఉంటే.. డబ్బులు ఊరకనే రావు.. ఈ స్కీమ్ లో పెడితే వస్తాయి