By: ABP Desam | Updated at : 23 Jan 2023 06:01 AM (IST)
Edited By: Arunmali
బంగారం, వెండి ధర - 23 జనవరి 2023
Gold-Silver Price 23 January 2023: పసిడి ధర అతి కొద్దిగా తగ్గింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున దిగి వచ్చాయి. బిస్కట్ బంగారం ధర ₹57 వేల మార్కును వదిలి రావడం లేదు. పసిడి పరిస్థితి చూస్తే తుపాను ముందు ప్రశాంతతలా కనిపిస్తోంది. కిలో వెండి ధర ₹ 200 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,060 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,250 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,060 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,300 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,040 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,060 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,210 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,300 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 గా ఉంది.
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,300 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 గా ఉంది.
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,250 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,060 గా ఉంది.
ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 250 పెరిగి ₹ 27,130 కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
Auto Stocks to Buy: బడ్జెట్ తర్వాత స్పీడ్ ట్రాక్ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?
Stock Market News: స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్ 377, నిఫ్టీ 150 అప్!
Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టోలు - బిట్‌కాయిన్ ఏంటీ ఇలా పెరిగింది!
Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్ మెషీన్స్, చిల్లర సమస్యలకు చెక్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ