అన్వేషించండి

Gold-Silver Price 19 December 2022: చాప కింద నీరులా పెరుగుతున్న పసిడి ధర, వెండిదీ అదే బాట

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,300 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

Gold-Silver Price 19 December 2022: బంగారం, వెండి ధరలు మెల్లగా పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున పెరిగాయి. 24 కేరెట్ల బంగారం ధర ₹54 వేల పైనే కదులుతోంది. కిలో వెండి ధర ₹ 300 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,490 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,300 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,490 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 73,300 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,560 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,160 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,490 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,640 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,540 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,540 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,950 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,490 గా ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 430 తగ్గి ₹ 26,300 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
Sai Pallavi as Ramayan Sita: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Embed widget