అన్వేషించండి

Gautam Adani: అదానీ గ్రూప్‌ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్‌ అదానీ రియాక్షన్‌ ఇది

మాపై దాడి చేసిన వ్యక్తులు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగించారు

Gautam Adani Blog: స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు చేసే వాళ్లకు, బిజినెస్‌ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలతో కూడిన ఒక బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌తో, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో ఆ కంపెనీ ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్‌ షార్‌ సెల్లర్‌ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌, అదానీ గ్రూప్‌ మీద చేసిన దాడికి సరిగ్గా సంవత్సరం అయింది. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ రిలీజ్‌ అయింది. ఆ రిపోర్ట్‌ తర్వాత, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ అథఃపాతాళానికి పడ్డాయి.

బ్లాగ్‌లో గుర్తు చేసుకున్న గౌతమ్‌ అదానీ
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన సరిగ్గా సంవత్సరం తర్వాత.. బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్‌, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ‍‌(Gautam Adani) మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన గురించి చెబుతూ తన బ్లాగ్‌లో ఇలా రాశారు "గత సంవత్సరం మాకు ఒక గొప్ప పాఠంగా నిలిచింది. మా వ్యాపారాన్ని నాశనం చేయడానికి ఒక సంస్థ ఎంతవరకు నిరాధారమైన ఆరోపణలు చేయగలదో కూడా మేం చూశాం. అది పెద్ద వ్యూహాత్మక దాడి. అది జరిగింది, మేము దానికి సాక్షులుగా ఉన్నాం".

టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం కూడా గౌతమ్ అదానీ స్పందించారు. "అదానీ గ్రూప్ అతి పెద్ద దాడిని ఎదుర్కొంది, కోలుకుంది. ఆ సంఘటన తర్వాత మేం బలంగా తయారయ్యాం" అని రాశారు.

మోసపూరిత దాడులను ఎదుర్కొన్నాం
"మాపై దాడి చేసిన వ్యక్తులు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగించారు. అసంపూర్ణమైన, నిరాధారమైన విషయాలను రహస్య ప్రయోజనాల కోసం ఉపయోగించారు. వాటితో నిరాధార ఆరోపణలు చేశారు, అదానీ గ్రూప్‌పై దుర్మార్గపు దాడికి పాల్పడ్డారు. గడ్డు పరిస్థితి ఎదురైనా అదానీ గ్రూప్ వెనుకడుగు వేయలేదు. ఆ ఆరోపణల తర్వాత కూడా మేము సంయమనం కోల్పోలేదు. మా పెట్టుబడిదార్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మా బలాలను & కీలక వ్యాపార అంశాలన్నింటినీ పునఃసమీక్షించాం. అదానీ గ్రూప్‌ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉండేలా చూసుకున్నాం. మా కార్పొరేట్ విధానాలు దోషరహితం. అవి ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి. భారతదేశ అవస్థాపనలో ముఖ్య పాత్రను కొనసాగించేలా మా వృద్ధి ప్రణాళికను పునఃపరిశీలించాం" అని కూడా తన బ్లాగ్‌లో గౌతమ్‌ అదానీ రాసుకొచ్చారు.

2023 సంవత్సరాన్ని అభ్యాస సంవత్సరంగా అభివర్ణించారు గౌతమ్ అదానీ. ఇంకా "గత సంవత్సరం అనుభవాలు, కష్టాలు మాకు మరింత విలువైన విషయాలను నేర్పించాయి. మేం పాఠాలు నేర్చుకున్నాం, బలపడ్డాం. భారతీయ వ్యవస్థపై మా విశ్వాసం మరింత బలపడింది" అని గౌతమ్‌ అదానీ స్పందించారు.

2023 జనవరి 24న, హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక వెలువడింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌ కంపెనీలు మోసం, స్టాక్ మానిప్యులేషన్, ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయని, మారిషస్‌లో సూట్‌కేస్‌ కంపెనీలను స్థాపించి, వాటి ద్వారా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచాయని తన నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపించింది. ఆ రిపోర్ట్‌ తర్వాత, గౌతమ్ అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్స్‌లో ‌(Adani Group Stocks) నాన్‌ స్టాప్‌ సెల్లింగ్‌ జరిగింది. ఒక దశలో, అదానీ గ్రూప్‌లోని ‍10 లిస్టెడ్‌ స్టాక్స్‌ మొత్తం మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల మార్కు దిగువకు పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ 22% నుంచి 80% వరకు నష్టపోయాయి. ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో అదానీ షేర్లు కోలుకున్నాయి.

మరో ఆసక్తికర కథనం: మరో ఆసక్తికర కథనం: భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Embed widget