అన్వేషించండి

Nykaa Shares Down: ఫ్రీ షేర్లు ఇస్తామన్నా పడుతోంది, మీకు బాగా తెలిసిన కంపెనీయే ఇది

నవంబర్ 26, 2021న తాకిన రికార్డు గరిష్ట స్థాయి రూ.2,574 నుంచి ఇప్పటివరకు ఈ కౌంటర్‌లో 53 శాతం నష్టాలు వచ్చాయి.

Nykaa Shares Down: ఇవాళ (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్లు బలంగా, భారీ బౌన్స్‌లో ఉంటే; FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa) షేర్లు మాత్రం రివర్స్‌ గేర్‌ వేశాయి. ఇంట్రా డే ట్రేడ్‌లో 1 శాతం పైగా క్షీణించి, రూ.1,198 వద్ద కొత్త కనిష్ట స్థాయిని తాకాయి. ఇది దీని కొత్త 52-వారాల కనిష్టం.

ఈ స్టాక్ గత ఏడాది నవంబర్‌ 10న లిస్ట్‌ అయింది. అప్పటి నుంచి ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఈ కౌంటర్‌ నష్టాల్లో ఉంది. ఈ నాలుగు రోజుల్లోనే 6 శాతం పడిపోయింది. 

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి, ఈ స్క్రిప్‌ 1.17 శాతం నష్టంతో రూ.1,200.60 వద్ద ఉంది. అదే సమయానికి S&P BSE సెన్సెక్స్ 1.22 శాతం పెరిగి 57,9345 పాయింట్లకు చేరుకుంది.

నవంబర్ 26, 2021న తాకిన రికార్డు గరిష్ట స్థాయి రూ.2,574 నుంచి ఇప్పటివరకు ఈ కౌంటర్‌లో 53 శాతం నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం, షేరు ఇష్యూ ధర రూ.1,125 కంటే కేవలం 7 శాతం పైన ట్రేడవుతోంది.

గత మూడు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లో 9 శాతం పెరుగుదలతో పోలిస్తే, నైకా 15 శాతం పడిపోయి అండర్‌పెర్ఫార్మ్‌ చేసింది. గత ఆరు నెలల కాలంలో 34 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 42 శాతం నష్టపోయింది.

ఫ్రీ షేర్లు ఇస్తామన్నా పడుతోంది
ఈ కంపెనీ మొదటి బోనస్ ఇష్యూ ప్రకటనే తుస్సుమంది. పెట్టుబడిదారులు పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపలేదు. 5:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి ఈ నెల 3న కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. అంటే, కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క షేరుకు ఐదు బోనస్ షేర్లు ఇస్తుందట. అయితే, అప్పటి నుంచి ఈ స్టాక్ దాదాపు 8 శాతం క్షీణించింది. 

బిజినెస్‌ 
నైకా బ్రాండ్‌ పేరిట బిజినెస్‌ చేసే FSN E-కామర్స్ వెంచర్స్, ఒక కన్జ్యూమర్‌ టెక్నాలజీ ఫ్లాట్‌ఫాం. అందం, వ్యక్తిగత సంరక్షణ & ఫ్యాషన్ ఉత్పత్తులను అమ్ముతుంది. సొంత బ్రాండ్ ప్రొడక్ట్స్‌ సహా వివిధ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను కూడా తన ఫ్లాట్‌ఫాం ద్వారా విక్రయిస్తుంది.

ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు చేసే ఖర్చులు తగ్గాయని, స్వల్పకాలంలో తమ వ్యాపారం ప్రభావం పడిందని, మధ్యకాలిక & దీర్ఘకాలిక వృద్ధి మాత్రం బలంగానే ఉందని కంపెనీ తెలిపింది.

పెద్ద సంఖ్యలో ఉన్న రిపీట్‌ కస్టమర్లు లేదా రిపీట్‌ యూసేజ్‌ బేస్‌ ఈ కంపెనీ బలంగా బ్రోకింగ్‌ హౌస్‌ ఎలారా క్యాపిటల్‌ (Elara Capital) విశ్లేషించింది. ఈ బలం కారణంగా ఆన్‌లైన్ BPCలో 26.8 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యాన్ని  కొనసాగించవచ్చని చెబుతోంది. దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లోకి నైకా బలంగా చొచ్చుకుపోతున్నందున కంపెనీ వృద్ధి మీడియంటర్న్‌లోనూ కొనసాగుతుందని ఎలారా క్యాపిటల్‌ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Embed widget