అన్వేషించండి

Young Liu: ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు 'పద్మభూషణ్' - ఈ తైవాన్‌ వ్యక్తి ప్రత్యేకత ఏంటి?

భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ ఒక తైవాన్‌ జాతీయుడిని వరించడంతో, యాంగ్‌ లీ గురించి తెలుసుకోవడానికి జనం ఆన్‌లైన్‌లో తెగ శోధిస్తున్నారు.

Foxconn Chief Young Liu honoured with Padma Bhushan: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు (Padma Awards 2024) ప్రకటించింది. వీరిలో.. ఐదుగురు పద్మవిభూషణ్‌, 17 మంది పద్మభూషణ్‌, 110 మంది పద్మశ్రీ అవార్డ్‌ అందుకుంటారు. పురస్కార గ్రహీతల్లో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు.

వాణిజ్యం &పారిశ్రమిక రంగంలో నలుగురికి ‘పద్మ’ గౌరవాలు దక్కాయి. జిందాల్‌ అల్యూమినియం ఫౌండర్‌ & CMD సీతారామ్‌ జిందాల్‌ (కర్ణాటక), ఫాక్స్‌కాన్ చైర్మన్‌ యాంగ్‌ లీ (తైవాన్‌) కి పద్మభూషణ్‌; ఫైనాన్స్‌ రంగ నిపుణురాలు కల్పన మోర్పారియా (మహారాష్ట్ర), ఐజ్మో లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ శశి సోనీ (కర్ణాటక) కి పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌ నెలల్లో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా నిర్వహిస్తారు.

భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ ఒక తైవాన్‌ జాతీయుడిని వరించడంతో, యాంగ్‌ లీ గురించి తెలుసుకోవడానికి జనం ఆన్‌లైన్‌లో తెగ శోధిస్తున్నారు.

యాంగ్‌ లీ ఎవరు? ‍‌(Who is Young Liu?)

- తైవానీస్ టెక్నాలజీ దిగ్గజ గ్రూప్‌ హోన్ హై టెక్నాలజీ (Hon Hai Technology) గ్రూప్ (Foxconn) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ‍‌(CEO) & చైర్మన్.

- ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ & అతి పెద్ద ఐఫోన్‌ (iPhone) తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు 2019 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వివిధ ఉత్పత్తులను ఈ కంపెనీ ఆవిష్కరిస్తుంది.

- పారిశ్రామిక రంగంలో యాంగ్‌ లీకి 40 ఏళ్ల అనుభవం ఉంది. ఈ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన వ్యవస్థాపకులు, ఆవిష్కర్తల్లో ఒకరు.

- యాంగ్‌ లీ గొప్ప వ్యవస్థాపకుడు. ఇప్పటి వరకు మూడు కంపెనీలను స్థాపించారు. 1988లో, 'యాంగ్‌ మైక్రో సిస్టమ్స్' పేరిట మదర్‌ బోర్డ్ తయారీ కంపెనీ; 1995లో, PC చిప్‌సెట్‌ కోసం నార్త్‌బ్రిడ్జ్ అండ్‌ సౌత్‌బ్రిడ్జ్ IC డిజైన్ కంపెనీ; 1997లో, ADSL IC డిజైన్ కంపెనీ ITeX ను స్థాపించారు.

- తైవాన్ నేషనల్ చియావో టంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో BS డిగ్రీని (1978), యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో MS డిగ్రీని (1986) పూర్తి చేశారు.

- 2023 జులైలో, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 'సెమికాన్ ఇండియా 2023' సదస్సులో, ఫాక్స్‌కాన్ చీఫ్ యాంగ్‌ లీ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) కలిశారు. అదే సదస్సులో ఈ ఇద్దరు సమావేశమయ్యారు. 

- మన దేశంలో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ భావిస్తోంది.

భారతదేశ ప్రజలకు లేదా వివిధ రంగాల్లో అసాధారణ/విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి & గౌరవించేందుకు.. ప్రతి సంవత్సరం పద్మ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ఈ గౌరవానికి ఎంపికైన వ్యక్తుల పేర్లను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఉత్సవంలో, పద్మ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.

మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కంటే ఎక్కువగా సిల్వర్‌ భయపెడుతోంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget