అన్వేషించండి

TDS: ఈ ఒక్క ఫారం నింపండి చాలు - టీడీఎస్‌ కటింగ్‌ తగ్గుతుంది, మీ జీతం పెరుగుతుంది

CBDT: ఈ కొత్త ఫారాన్ని ఈ నెల 15న విడుదల చేశారు. దీనిద్వారా వివిధ పెట్టుబడుల గురించిన సమాచారాన్ని ఇవ్వొచ్చు. తద్వారా, ఇది మీ జీతంలో కోతను తగ్గిస్తుంది.

Form 12BAA Will Reduce TDS Cutting: టీడీఎస్‌ (Tax Deduction at Source) అనేది ప్రతి ఉద్యోగికి బాగా తెలిసిన బాధాకరమైన పదం. దీనిని తలుచుకున్నప్పుడల్లా వేతనరాయుళ్ల గుండె కలుక్కుమంటుంది. ప్రతి నెలా, జీతం చేతికి రాకముందే అందులో కొంత మొత్తాన్ని టీడీఎస్‌ తినేస్తుంది. ఫలితంగా.. నెలనెలా తక్కువ జీతాన్ని ఉద్యోగులు డ్రా చేస్తున్నారు. ఇప్పుడు, టీడీఎస్‌ ఇబ్బందులను నుంచి ఉద్యోగులను తప్పించి, వారి కళ్లలో ఆనందం చూడడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. TDSకు సంబంధించిన నిబంధనలను సవరించింది. 

నూతన సవరణల తర్వాత, TDS కోతలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ కంపెనీ, మీ జీతం నుంచి ముందస్తు పన్ను కోతను గణనీయంగా తగ్గిస్తుంది. అంటే.. మీ జీతం నుంచి టీడీఎస్‌ కటింగ్‌ తగ్గుతుంది, గతం కంటే ఎక్కువ జీతం చేతికి వస్తుంది. ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం, మీరు ఇంకెక్కడైనా TDS లేదా TCS (Tax Collected at Source) చెల్లిస్తుంటే, మీ కంపెనీ మీ జీతం నుంచి పన్ను కోత పెట్టదు.

ఫారం 12BAA జారీ చేసిన CBDT 
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), TDS కటింగ్‌ను తగ్గించేందుకు కొత్త ఫారం "12BAA"ను ‍‌(Form 12BAA) జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmal Sitharaman), బడ్జెట్‌లో చేసిన ప్రకటన ప్రకారం CBDT ఈ కొత్త ఫామ్‌ను విడుదల చేసింది. ఈ ఫారంలో, మీరు ఇప్పటికే చెల్లించిన TDS & TCS కు సంబంధించిన సమాచారాన్ని మీ కంపెనీకి అందించొచ్చు. ఆ ఫారంలో ఎఫ్‌డీ (Fixed Deposit), ఇన్సూరెన్స్ కమీషన్, ఈక్విటీ షేర్ డివిడెండ్, ఏదైనా వాహనం కొన్నప్పుడు చెల్లించిన పన్ను వంటి వాటి గురించి సమాచారం ఇవ్వొచ్చు. 

ఇప్పటి వరకు, ఉద్యోగి ప్రకటించిన పెట్టుబడుల ప్రకారం కంపెనీలు టీడీఎస్‌ను మినహాయించేవి. ఇతర చోట్ల చెల్లించే పన్నులు ఇందులో ఉండవు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు వచ్చింది. ఒక ఉద్యోగి ఎక్కడ TCS & TDS చెల్లించినా, వాటి సమాచారం ఇవ్వడం వల్ల జీతంలో తగ్గింపులను అడ్డుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు నెలవారీ ఆదాయం పెరుగుతుంది. CBDT అక్టోబర్ 15న ఈ ఫారాన్ని విడుదల చేసినప్పటికీ, ఇది అక్టోబర్‌ 01 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తారు.

ఫారం 12BBతో పోలిక
ఫారం 12BAA ఫారం 12BB మాదిరిగానే ఉంటుంది. ఫామ్‌ 12BBలోనూ ఉద్యోగి తన పెట్టుబడుల గురించి వెల్లడిస్తాడు. ఫామ్ 12BBలోని వివరాల ఆధారంగా కంపెనీ అతని జీతం నుంచి TDSను తీసివేస్తుంది. ఫారం 12BAA ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి మొదట పాత పన్ను విధానం (Old Tax Regime) లేదా కొత్త పన్ను విధానంలో (New Tax Regime) ఏదోక దానిని ఎంచుకున్నట్లు కంపెనీకి చెప్పాలి. ఆ తర్వాత, ఫారం 12BAA ద్వారా తన పెట్టుబడుల గురించి సమాచారం ఇవ్వాలి.

మరో ఆసక్తికర కథనం: త్వరలో కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌ 3.0 - ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ ఇంకా ఈజీ 

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget