అన్వేషించండి

Forex Reserves: ఖజానాకు కాసుల కళ, రికార్డ్‌ బద్ధలు కొట్టేందుకు సిద్ధమవుతున్న ఫారెక్స్‌

ప్రస్తుతం, ఫారెక్స్‌ నిల్వలు తమ జీవిత కాల గరిష్ట రికార్డ్‌ స్థాయికి దాదాపు 3 బిలియన్‌ డాలర్ల దూరంలో ఉన్నాయి.

Foreign Currency Reserves in India: భారత ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోంది, దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి. భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం నాడు సరికొత్త గణాంకాలు విడుదల చేసింది. 

ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2024 మార్చి 22తో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు (India's Forex Reserves) 140 మిలియన్‌ డాలర్లు పెరిగి 642.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనికిముందు, 2024 మార్చి 15తో ముగిసిన వారంలో నిల్వలు 642.492 బిలియన్‌ డాలర్ల దగ్గర ఉన్నాయి. 

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధికంగా 645 బిలియన్ డాలర్లకు ‍‌చేరుకున్నాయి. ఇది, జీవితకాల గరిష్ట రికార్డ్‌ (Forex reserves all-time high record). భారతదేశం నుంచి ఎగుమతులు పెరగడం వల్ల దేశంలోకి విదేశీ నగదు ప్రవహిస్తోంది. ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే జీవితకాల రికార్డ్‌ బద్ధలవుతుంది, కొత్త రికార్డ్‌ పుట్టుకొస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం, ఫారెక్స్‌ నిల్వలు తమ జీవితకాల గరిష్ట రికార్డ్‌ స్థాయికి దాదాపు 3 బిలియన్‌ డాలర్ల దూరంలో ఉన్నాయి. 

అయితే, ఆర్‌బీఐ డేటా ప్రకారం, సమీక్ష కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించాయి. 2024 మార్చి 22తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 123 బిలియన్ డాలర్లు తగ్గి 568.26 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

పెరిగిన బంగారం నిల్వలు
సమీక్ష కాలంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు కూడా పెరిగాయి. RBI గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) 347 మిలియన్ డాలర్లు పెరిగి 51.48 బిలియన్ డాలర్లకు చేరాయి. SDRs (Special Drawing Rights) మాత్రం 57 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.21 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.66 బిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి.

ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ది కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దానిని గుర్తించాలి. 

డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డ్‌ పతనం తర్వాత, రూపాయికి మద్దతు ఇవ్వడానికి RBI ఇటీవలి రోజుల్లో డాలర్లను విక్రయించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనతను ఆపడానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో విదేశీ మారక నిల్వలు తగ్గాయి. దేశీయ కరెన్సీని నియంత్రించడానికి, లేదా డాలర్‌తో పోలిస్తే పతనాన్ని ఆపడానికి RBI జోక్యం చేసుకున్నప్పుడు విదేశీ మారక నిల్వల్లో మార్పులు సంభవిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: నగల మీద మోజు వదిలేయండి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget