FII stake: మూడు నెలల్లోనే ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలోకి ఒక PR సంస్థ ద్వారా వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే.
FII stake: రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యెస్ బ్యాంక్‌లో తమ పెట్టుబడులను ఇటీవల భారీగా పెంచారు. దీంతో, ఈ ప్రైవేట్ రంగ రుణదాతలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల మొత్తం వాటాను గణనీయంగా పెరిగింది.
యెస్ బ్యాంక్‌లో FPI హోల్డింగ్ 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న 12.15% నుంచి డిసెంబర్ చివరి నాటికి 23.24%కి పెరిగింది. అంతకుముందు, 2022 మార్చిచివరి నాటికి, ఈ ప్రైవేట్ రంగ రుణదాతలో FPIలకు 10.97% వాటా ఉంది.
PE సంస్థలైన కార్లైల్ గ్రూప్ (Carlyle Group), అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు (Advent International) సుమారు 10% వాటాను విక్రయించిన యెస్ బ్యాంక్, దాని ద్వారా దాదాపు 8,900 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఒక PR సంస్థ ద్వారా వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే.
2020లో, నిండా మునిగిపోయిన స్థితిలో ఉంది యెస్ బ్యాంక్. అప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్కీమ్ వల్ల, తోటి బ్యాంకులు యెస్ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టి బెయిలౌట్ చేశాయి. అప్పటి నుంచి YES బ్యాంక్ ఆదాయాలు, ముఖ్యంగా ఆస్తి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
దీంతో, యెస్ బ్యాంక్ స్టాక్ మీద దలాల్ స్ట్రీట్ బుల్లిష్‌గా మారింది, షేర్ ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 14% పెరిగిన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌తో పోలిస్తే ఈ స్టాక్ 30% పైగా లాభపడింది.
యెస్ బ్యాంక్‌లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ 0.47% వద్ద చాలా తక్కువగా ఉన్నాయి, గత కొన్ని త్రైమాసికాల నుంచి ఇలాగే కంటిన్యూ అవుతోంది.
క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, రూ. 50,000 బ్యాడ్ లోన్‌లను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థ JC ఫ్లవర్స్‌కు (JC Flowers) బదిలీ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల యెస్ బ్యాంక్ వృద్ధి మీద స్ట్రీట్ అంచనాలు అమాంతం పెరిగాయి.
బ్యాడ్ న్యూస్ కూడా ఉంది
కానీ, సమీప కాలంలో ఈ స్టాక్‌కు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, స్టాక్ ప్రైస్ మీద అది ప్రెజర్ పెట్టవచ్చు.
2020లో YES బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టిన ఆ బ్యాంక్‌ను కాపాడిన తోటి బ్యాంకులు - IDFC ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్. తమ పెట్టుబడులకు ప్రతిగా ఈ బ్యాంకులు యెస్ బ్యాంక్‌లో వాటాలు పొందాయి. ఈ 5 రుణదాతలకు కలిపి యెస్ బ్యాంక్‌లో 32.62% వాటా ఉంది. ఈ సంవత్సరం మార్చితో, ఈ షేర్లకు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ముగుస్తుంది. అంటే, ఆ షేర్లను ఆయా బ్యాంకులు అమ్ముకోవడానికి స్వేచ్ఛ వస్తుంది.
ఈ 5 బ్యాంకులతో పాటు, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు (HDFC) YES బ్యాంక్‌లో 3.48% వాటా ఉంది.
గత 3 సంవత్సరాల్లో యెస్ బ్యాంక్ స్టాక్ విలువ రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. అందువల్ల, ఈ 6 బ్యాంకులు లేదా వీటిలో కొన్ని, తమ వాటాలను పాక్షికంగా విక్రయించడం ద్వారా లాభాలు బుక్ చేసుకోవచ్చు. ఇదే జరిగితే స్టాక్ ధర మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.