News
News
X

FII - Reliance: రిలయన్స్‌ షేర్లు అమ్మేస్తున్న విదేశీ వాటాదార్లు, అంబానీ అదృష్టం తారుమారైందా?

విదేశీ పెట్టుబడి సంస్థలు వరుసగా ఆరు త్రైమాసికాలుగా రిలయన్స్‌లో తమ హోల్డింగ్‌లను తగ్గించుకుంటూ వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

FII - Reliance: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL). గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ల ధర రెండింతలకు పైగా పెరిగాయి. ఇదొక బ్లూచిప్‌ కంపెనీ. మరేం ఆలోచించకుండా ఈ కంపెనీ షేర్లు కొనేయవచ్చు. 

ఆశ్చర్యకరంగా, దేశంలోనే అత్యంత విలువైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో విదేశీ యాజమాన్యం (FII) గత 5 సంవత్సరాలుగా మరీ తీసికట్టుగా తయారైంది.

డిసెంబర్ 2022 నాటికి, ఈ ఇండెక్స్ హెవీవెయిట్‌లో మొత్తం FII యాజమాన్యం 23.48% వద్ద ఉంది. విదేశీ పెట్టుబడి సంస్థలు వరుసగా ఆరు త్రైమాసికాలుగా రిలయన్స్‌లో తమ హోల్డింగ్‌లను తగ్గించుకుంటూ వస్తున్నాయి.

ఎఫ్‌ఐఐల మొత్తం హోల్డింగ్స్‌ సెప్టెంబర్ 2021లో 25.41%గా ఉండగా, క్రమంగా తగ్గుతూ 2022 డిసెంబర్ చివరి నాటికి 23.48%కి దిగి వచ్చినట్లు ఏస్ ఈక్విటీ డేటాను బట్టి అర్ధం అవుతోంది.

2022లో ఈ స్టాక్ పనితీరును పరిశీలిస్తే, RIL దాదాపు 8% రిటర్న్‌లను షేర్‌హోల్డర్‌లకు ఇచ్చింది. అదే సమయంలో నిఫ్టీ50 4% రాబడి అందించింది. 

కానీ, 2023లో ఇప్పటివరకు, ఈ స్టాక్ నిఫ్టీ50 గ్రూప్‌లో బాగా వెనుకబడి ఉంది, దాదాపు 10% నెగెటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చింది. నిఫ్టీ50 కంటే మరీ దారుణంగా మారింది.

2022 సెకండాఫ్‌ నుంచి బ్యాడ్‌ టైమ్‌
చమురు కంపెనీ పొందిన విండ్‌ఫాల్ లాభాల మీద ప్రభుత్వం అదనపు పన్ను విధించినప్పటి నుంచి, అంటే 2022 రెండో సగం నుంచి RIL షేర్ పనితీరు దెబ్బతింది.

RIL మొత్తం ఆదాయంలో ఆయిల్-టు-కెమికల్స్ (O2C) వ్యాపారానిదే 65% వాటా. అంటే, రిలయన్స్‌ కోర్‌ బిజినెస్‌ ఇదే. కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్‌ టాక్స్‌ వల్ల ఈ వ్యాపారానికి పెద్ద దెబ్బగా మారింది.

ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై కట్టాల్సిన పన్నులు మొత్తం O2C ఆదాయంలో 50% పైగా ఉండడం వల్ల మొత్తం కంపెనీ ఆదాయానికి సమ్మెట పోటులా మారింది.

గత కొన్ని త్రైమాసికాల్లో కంపెనీ నికర ఆదాయం తగ్గడానికి ఇదే కారణమైంది.

గత 6 నెలలుగా ఇంధన మార్కెట్లలో అస్థిరత, 5G టెలికాం సేవల్లో పెట్టుబడులు, టారిఫ్ పెంపుదల లేకపోవడం వంటి కారణాలు RILను ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా, మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు ఈ కంపెనీ ఆదాయ అంచనాలను కూడా 6% తగ్గించారు.

RIL ఆదాయం, షేర్‌హోల్డర్లలో విశ్వాసం పెరగాలంటే ఇంధన వ్యాపారంలో మెరుగుదల కీలకమని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. చైనాలో డిమాండ్‌ పుంజుకోవడం, రిఫైనింగ్‌ వ్యాపారంలో రికవరీ, విండ్‌ఫాల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం, దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి పెరగడం వంటివి RIL ఆదాయాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.

ఏది ఏమైనా, మెజారిటీ ఎనలిస్ట్‌లు RIL స్టాక్‌పై “బయ్‌” రేటింగ్‌ కంటిన్యూ చేస్తున్నారు. అయితే, సంబరాలు చేసుకునేంత గొప్ప సంగతులేవీ సమీప కాలంలో రిలయన్స్‌లో ఉండకపోవచ్చని చెబుతున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 07 Feb 2023 03:17 PM (IST) Tags: Reliance Industries RIL Market capitalization FII holding

సంబంధిత కథనాలు

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

టాప్ స్టోరీస్

1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క

1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్