Meta Share Crash: మార్కెట్ చరిత్రలో తొలిసారి భారీగా పతనమైన మెటా షేర్లు..195 బిలియన్ డాలర్లు ఆవిరి
ఫేస్ బుక్ పేరెంట్ గ్రూప్ మెటా షేర్లు భారీగా పతనమయ్యాయి. చరిత్రలో తొలిసారిగా 195 బిలియన్ల డాలర్లు నష్టపోయింది. ఫేస్ బుక్ ఆదాయం తగ్గడంతో మార్కెట్ లో ఇంత భారీ కుదుపు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
మెటా మార్కెట్ షేర్లు గురువారం చరిత్రలో అత్యంత దారుణంగా పతనమయ్యాయి. ఫేస్ బుక్ ఆదాయం పేలవంగా ఉండడంతో ఫేస్‌బుక్ పేరెంట్ గ్రూప్ మెటా యూఎస్ ట్రేడింగ్‌లో 22% క్షీణించింది. దీంతో సుమారు 195 బిలియన్ల డాలర్లు నష్టపోయింది. ప్రస్తుత స్థాయిలలో యూఎస్ కంపెనీకి మార్కెట్ విలువలో ఇది అతిపెద్ద పతనం. కానీ నష్టాల నుంచి మెటా తిరిగి పుంజుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. సాంకేతిక షేర్లలో అస్థిరత ఉందని అందువల్ల ఇటీవలి మార్కెట్లు విపరీతంగా ఊగిసలాడుతున్నాయంటున్నారు. బై ది డిప్ వ్యాపారులు కొన్నిసార్లు ట్రేడింగ్ రోజు చివరి గంటలలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ టిక్‌టాక్ వంటి ప్రత్యర్థుల నుంచి మెటా గట్టి పోటీని ఎదుర్కొంటుందని, రాబడి ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మెటా ఇప్పుడు తుపాను మధ్యలో ఉంది : మార్కెట్ విశ్లేషకులు
ఫేస్‌బుక్ పతనాన్ని కొన్ని టెక్ కంపెనీలు మార్కెట్ పవర్‌తో బెహెమోత్‌లుగా మారడానికి ఎలా ప్రయత్నిస్తాయో చెప్పవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్లో భారీగా దూసుకుపోతూ ఏదైనా పొరపాటు జరిగితే అంతే స్థాయిలో పతనమవుతాయని అంటున్నారు. ఈ క్షీణతను మరో మార్గంలో చెప్పాలంటే... మెటాలో 20% క్షీణత 500 సభ్యులున్న ఎస్ అండ్ పీ లో 452 మంది మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. మెటా ఇప్పుడు ఓ తుపాను మధ్యలో తనను తాను కనుగొంటుంది అని ట్రూయిస్ట్ సెక్యూరిటీస్‌లో విశ్లేషకుడు యూసఫ్ స్క్వాలీ అన్నారు.
2018లో 120 బిలియన్ డాలర్ల నష్టం
ట్విట్టర్, స్నాప్, ఫిన్టేర్ట్ అన్నీ నాస్‌డాక్ 100 ఇండెక్స్ లో తక్కువగా ట్రేడ్ అయ్యాయి. న్యూయార్క్‌లో గురువారం ఉదయం 7:23 గంటలకు మెటా 251 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. ఇది బుధవారం $323కి కన్నా తక్కువ. మునుపటి ముగింపు నాటికి మెటా మార్కెట్ క్యాప్ సుమారు 900 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. మెటా షేర్లు అనూహ్యంగా పడిపోవడం ఇది మొదటిసారి కాదు. వినియోగదారుల వృద్ధి మందగించడంతో జులై 2018లో స్టాక్ 19% పడిపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు 120 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఆ సమయంలో మెటా యూఎస్ ట్రేడెడ్ కంపెనీకి ఒక రోజులో అత్యధికంగా విలువ కోల్పోయిన రికార్డును నెలకొల్పింది.
Also Read: మెటావర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మార్క్.. ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!