అన్వేషించండి

Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మస్క్‌ ఇప్పుడు నంబర్‌.2 - నంబర్‌.1 ఎవరంటే?

2021 సెప్టెంబర్‌లో చివరిసారిగా నంబర్‌ 2గా ఉన్న మస్క్‌, మళ్లీ ఇప్పుడు అదే స్థానానికి దిగి వచ్చారు.

Elon Musk: $340 బిలియన్‌ డాలర్ల విలువతో, సరిలేరు తనకెవ్వరూ అన్నట్లు ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, ఇప్పుడు భారీగా సంపద కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా తొలి స్థానంలో నిలబడ్డారు.

ఎలాన్‌ మస్క్ అదృష్టం ఈ ఏడాది తిరగబడింది. 2022 జనవరిలో మస్క్‌ సంపద విలువ $300 బిలియన్లకు పైగా ఉంది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం.. 51 ఏళ్ల ఎలాన్ మస్క్ సంపద 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు $100 బిలియన్లకు పైగా పడిపోయి, $168.5 బిలియన్లకు దిగి వచ్చింది. ఆర్నాల్ట్ (వయస్సు 73 సంవత్సరాలు) నికర విలువ $172.9 బిలియన్ల కంటే ఇది తక్కువ. ఆర్నాల్ట్‌ సంపదలో ఎక్కువ భాగం, అతని దిగ్గజ ఫ్యాషన్ కంపెనీ LVMH నుంచి వచ్చింది. LVMHలో ఆర్నాల్ట్‌కు 48% వాటా ఉంది.

ర్యాంకింగ్స్‌లో పతనం - షేర్లలో క్షీణత
2021 సెప్టెంబర్‌లో చివరిసారిగా నంబర్‌ 2గా ఉన్న మస్క్‌, మళ్లీ ఇప్పుడు అదే స్థానానికి దిగి వచ్చారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొంటానని 2022 ఏప్రిల్‌లో ప్రకటన చేసి, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఈ ఒప్పందం తర్వాతే ఆయన ఫేట్‌ మారింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఫెడరల్ రిజర్వ్ సహా ఇతర సెంట్రల్ బ్యాంకులు అత్యంత దూకుడుగా వడ్డీ రేట్లు పెంచాయి. దీంతో, మస్క్‌కు చెందిన టెస్లా (Tesla Inc.) కార్ల కంపెనీ సహా అన్ని కంపెనీల షేర్ల ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. హయ్యర్‌ వాల్యుయేషన్ల నుంచి దిగి వచ్చాయి. ఈ సంవత్సరం టెస్లా ఎలక్ట్రిక్ కార్ల షేర్‌ ధర 50% పైనే పడిపోయింది. 

ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని ఫినిష్‌ చేయడానికి మస్క్ 19 బిలియన్‌ డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఈ ఏడాది ఏప్రిల్‌, ఆగస్టులో విక్రయించారు. దీంతో ఈ కుబేరుడి సంపద తగ్గుతూ వచ్చింది. ఆర్థిక మాంద్యం భయాలతో, ఖరీదైన టెస్లా కార్లకు గిరాకీ తగ్గుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. దీనికి తోడు, ట్విటర్‌ మీదే మస్క్‌ ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం కూడా వాళ్ల ఆందోళనలు పెంచింది. దీని ఫలితంగా 2022 సెప్టెంబరు నుంచి టెస్లా షేర్‌ వాల్యూ 40% తగ్గింది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ కొనుగోలు ప్రక్రియను 2022 అక్టోబర్‌లో మస్క్‌ పూర్తి చేశారు. అంటే, ఈ ఒప్పందం పూర్తి కావడానికి నెల రోజుల ముందు నుంచే టెస్లా షేర్ల మీద ఈ ప్రభావం కనిపించింది.

నిలకడగా ఎదుగుతూ వచ్చిన ఆర్నాల్ట్‌
మస్క్‌తో పోలిస్తే, ఇప్పుడు నంబర్‌ 1 స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ ఎలాంటి చమత్కారాలు చేయలేదు. చాలా కాలంగా సంపద ర్యాంకింగ్స్‌లో ఉన్నారు. అయితే, ఆయన సంపద ఎప్పుడూ అనూహ్య వేగంతో పెరగలేదు. స్థిరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల... మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి వాళ్ల సంపద దెబ్బతిన్నా, బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ మాత్రం ఇబ్బంది పడలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన వ్యాపార సామ్రాజ్యం నిలదొక్కుకుంది.

ప్యారిస్ కేంద్రంగా LVMH Moet Hennessy Louis Vuitton డిజైనర్ అప్పారెల్‌ పని చేస్తోంది. దీంతోపాటు, ఆర్నాల్ట్‌కు ఫైన్‌ వైన్స్‌, రిటైల్ బిజినెస్‌ కూడా ఉన్నాయి. చాలా దేశాల్లో కోవిడ్ సంబంధిత షాపింగ్, ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ వ్యాపారాలు ఒక్కసారిగా, భారీగా పుంజుకున్నాయి. పెంటప్‌ డిమాండ్ నుంచి ప్రయోజనం పొందాయి. ఆర్నాల్ట్ బ్రాండ్లను (Christian Dior, Fendi, Bulgari, Tiffany & Co., champagne house Moet & Chandon‌) సంపన్నుల మాత్రమే భరించగలరు. 

మూడో స్థానంలో గౌతమ్‌ అదానీ
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... $133.70 బిలియన్లతో గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌ వరుసగా 4, 5 ర్యాంక్స్‌ దక్కించుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Embed widget